పుట:కాశీమజిలీకథలు -04.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

39]

కళావతికథ

305

నుంటి. ఇందులకు మూలమేమియు దెలియక యాలోచించుఁ గూర్చున్నదానఁ గూర్చుండినట్టుంటిని. ఇంతలో నీవు వచ్చితివి. నిన్నుఁ జూచుటచే నావంత కొంత తగ్గినది. నిజము తెలిసికొనక యూరక నీడద్రొక్కు కొని వెఱచెద వేటికి నన్ను మా యూరు జేర్చితివేని నీకుఁ దగినంత పారితోషిక మిప్పింతునని యతండు నమ్మునట్లు పలికెను.

అప్పుడతండు గుండెఁ గుదుటపఱచుకొని ధైర్యముతోఁ గన్నులం దెరచి అమ్మా ! తల్లీ ! నీవు రాజపుత్రికవా ! యెఱుఁగక బ్రహ్మరాక్షసి వనుకొంటిని గదా ! క్షమింపుము. మీతండ్రి ప్రసిద్ధి వినియుంటి, మీదేశ మిచ్చటికి జాలదూర మున్నది. కానిమ్ము. నెమ్మదిమీఁద నిన్నుఁ మీయిల్లు చేర్చువాఁడ నిప్పుడు మాయింటికిరమ్ము పోవుదము ఈవస్తువులతో నిన్నుజూచిన ప్రజలు దొంగలగుదురు. తీసి నాకిమ్ము మూటఁగట్టి గుప్త ముగా దెచ్చెదనని చెప్పుటయు నాబాలిక వల్లె యని యామండనము లన్నియుఁ దీసి యా భూసురున కిచ్చినది. అతండు బియ్యము పారఁబోసి యామండలముల మూటఁ గట్టికొని యాబలిక వెంటరా తన గ్రామమునకుఁ బోయెను.

గీ. తాటకకు మేనయత్తపూ • తనకుఁ దల్లి
   శూర్పనఖ పెద్దకూఁతురె • చ్చుక హిడింబి
   కక్కలంకిణిచెల్లె లో • యనఁగ వెలయుఁ
   జోలగయ్యళి యాసదా • చారినారి.

ఆ రాగ యెంటికివచ్చి మగనిం జూచి కసరుచు నీబాలిక నేమిటికిఁ దీసికొని వచ్చితివి ? దీనిసంతోషమున ముష్టియెత్త మానివేసితివి కాబోలును. నేఁడు మీయందరిపొట్ట లెటుల పూడ్చికొనెదరు ? ఈ పాడుకాపురము చేయలేక నేను చచ్చిపోవు చున్నానని నోటికి వచ్చినట్లు ప్రేలుటయు నతండు రహస్యముగా నోసీ ? యీబాలికను నిందింపకుము. శ్రీకృష్ణదేవరాయల కూఁతురు. ఇవిగో ? దీని నగలు దీసి నాకిచ్చినది. దీని వెల పదివేలకు మించ యుండును. పాడుబియ్యమొక్కపూటకుఁ జాలవని పాఱబోసి వీని మూటఁ గట్టుకొని వచ్చితిని. తప్పా ! చెప్పుము. ఈచిన్న దానినిగన్న తండ్రి కప్పగించిన మంచి పారితోషిక మిప్పింతునని చెప్పినది. మేము రేపే పోయెదమని యాకథయంతయుం జెప్పిన విని యాగయ్యాళిమొగము వికసింప నబ్బురపాటుతో నా మండనము లన్నియు లెక్కించుకొని మూటఁగట్టి లోపల దాచి వచ్చిన మగని కిట్ల నియె. నీవీ తొడవులిందు బెట్టిదీనినొక్కరితం దీసికొనిపోయి తండ్రి కప్పగింతువేని రాజు నగలమాట నడుగక మానడు.

అప్పుడు మనమాయలంకారముల నిచ్చి యవలయునుగదా ? ఆతండు పిన కానుకలిచ్చును కాని ఎలలో బడవ కొచ్చనలు బహ్మంచమగును. చేతికి దొరికినది విడిచి రాఁబోవు దానినిమిత్తము ఉన్న నేల? వినుండీ చిన్న