పుట:కాశీమజిలీకథలు -02.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిదత్తుని కథ

237

అంతియ కాని యీ కాంతను నేను వరింపలేదని చెప్పెను. ఇట్లు వారిరువురు మాట్లాడుకొనుచుండగా నచ్చటికి గలహంసికతో గూడ హరిదత్తుడు వచ్చెను. వారిరువురను గాంచి అదృష్టదీపుడును వెఱగంది చూచుచుండెను ప్రియంవదయు గలహంసికయు సమానాకారములతో నొప్పుచున్న అన్నదమ్ముల జూచి యించుక భేదముగానక విస్మయలజ్జాసంభ్రమములు మనంబున బెనగొన నేమియు మూటాడక చూచుచుండిరి.

అప్పుడు కలహంసిక ప్రియంవద యొద్దకు బోయి, అక్కా! యిక్కాంతు డెవ్వడు. యింత యాలస్యము చేసితివేల? నీ వాలసింపగా హరిదత్తుడు పోయెదనని తొందర సేయగా నిచ్చటికే తీసికొని వచ్చితిని. అతండును హరిదత్తుని పోలికగానే యున్నవా డెవ్వడని యడుగగా నది యౌరా! ఇంత చిత్రము నేనిదివరకు చూచి యుండలేదు. ఈతడే హరిదత్తుడని నేను నమ్మి మాట్లాతిడిని అతండిచ్చటికే వచ్చెను గదా అని జాగు చేయుచున్నదాన నింతలో మీరే వచ్చితిరి. ఈతండెవ్వడో నేనెరుగనని జెప్పినది అట్టి సమయమున బలభద్రుడు హరిదత్తుని గురుతుపట్టి తమ్ముడా! ఇచ్చటి కెట్లు వచ్చితివి. ఈ కాంతతో నెట్లు మైత్రి గలసినది మీ అన్నగారిని జూడు మితడే యని చెప్పి అదృష్టదీపునికి గూడ వానిని జూపుచు నితడే నీ తమ్ముడు చూడుమని పలికెను. అప్పుడా యిరువురు నొండొరు లెరింగిన పిమ్మట అత్యంతానురాగముతో గౌగలించుకొనుచు బెద్దతడవు మైమరచి కన్నుల నానంద బాష్పములు గార మేనులు పులకరింప నెట్టకేల కెలుంగరాల్పడ అయ్యో! తమ్ముడా! మనమెంత దిక్కు లేని వారమైతిమి. అన్నన్నా! జన్మ ముత్క్రుష్టమైన దైనను మిక్కిలి దైన్యమనుభవింపవలసి వచ్చెనే! అని పలుకుచు దల్లినిగురించి యాలోచించుచు దండ్రిని గురించి విచారించుచు నీ రీతి కొంతతడవు నూతనసమాగమక్రియావిశేషకౌతుకం బనుభవించిరి.

పిమ్మట హరిదత్తుడు బలభద్రునిం జూచి అన్నా! నీవు నన్నిచ్చట విడచి వచ్చిన తరువాత నూరక గూర్చుండనేల నింతలో బురవిశేషములు చూచి వచ్చెదనని యూహించి అంగడికి బోయితిని. అచ్చట నన్నీ చిన్నది పూర్వమందెప్పుడో యెరింగినట్లు మాట్లాడి బలాత్కారంబుగా నన్ను బండిలో గూర్చుండబెట్టుకొని యీ ప్రాంతమందున్న యుద్యానవనములోనికి దీసికొని పోయినది. అందీ ప్రియంవద నన్ను ప్రియుండని పిలుచుచు నేమో కావించినది. ఇంతలో నీదేవీపూజ జ్ఞాపకము వచ్చినందున దటాలున లేచి నన్నందు నిలిపి యిచ్చటికి వచ్చినది.

ఎంతసేపటికి రాకుండుట విసిగి నేను బోయెదనని చెప్పిన నన్నీ కలహంసిక యిచ్చటికి దీసికొని వచ్చినది. యిచ్చట మీరు కనంబడితిరి. ఇదియే నీ వరిగిన తరువాత జరిగిన కథయని చెప్పెను. అదృష్టదీపుండును తన మనంబున దలంచుకొనిన ప్రకారము జరిగినందులకు మిక్కిలి సంతోషింపుచు దైవమును మెచ్చుకొనుచు, బలభద్రా! మనమిక జాగుచేయరాదు. తమ్ముని వెదకి తీసికొని వచ్చినట్లె తల్లినిం