పుట:కాశీమజిలీకథలు -02.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

కాశీమజిలీకథలు - రెండవభాగము

యని పలుకుచు అతని మొగము ముద్దుగొనుచు జెక్కుల నొక్కుచు పుష్పశయ్యపై జేర్చినది.

అంత మోహమాపుకొనలేక తరినరసి స్మరుడును విరితూపుల నిరువురను సరిగా గురిచేసి వేధింపుచుండ నా హరిదత్తుడేమియు మాటడలేక యాకోకస్తని చేయు కృత్యములకు బ్రతికృత్యములు గొన్ని గొన్ని గావించి యించుక నవ్వుచు, బువ్వుబోణీ నీ వెంతకైన సాహసికవు. నే నిదివరకు రెండు ప్రమాదములు దప్పించుకొంటిని. గాని యిప్పుడు దాటలేక పోయితిని. నిజముగా నీవు పరకాంతవు కావుగదా! నీయందు లగ్నమైన నా చిత్తమే కానట్లు చెప్పుచున్నది. అని యమ్ముదితను గారవించు సమయంబున దటాలున లేచి యా చిగురుబోడి అయ్యో! ప్రమాదము వచ్చినది. నేను క్రీడాశైలమునకు బోవుచు మిమ్ము జూచి యా మాట మరచి యీ యుద్యానవనము లోనికి వచ్చితిని. దేవిని సేవింప వేగమ బోవలయును. వివాహావధివరకు బ్రతి శుక్రవారము నిట్లు భువనేశ్వరీదేవి నర్చింపవలయునని మా గురువుగా రానతిచ్చిరి. నాటి నుండియు నియమము తప్పక నేటివరకు సేవించుచుంటిని. వేళ అతిక్రమించు చున్నది. నియమమున కంతరాయముగూడ వచ్చినది. మోహమాపలేక నూతనసమాగమము గనుక విస్మృతి నొందితిని కానిమ్ము . ఇప్పుడైన జ్ఞాపకము వచ్చినది. వేగమే పోయివచ్చెద. ఈ శయ్యయందు విశ్రమించియుండుడు. నా చెలులందరు నుపచారములు చేయుచుందురు. అని పలుకుచు దటాలున లేచి కలహంసిక నతని సేవార్థము నియమించి మరల బండినెక్కి అతివేగముగా గ్రీడాశైలమునకు బోయినది.

యథాప్రకారము బండి యాకొండదండదిగి అప్పడతి వడివడి పూజాద్రవ్యములుగల సజ్జచేతంబూని యగ్గిరిశిఖరమెక్కి తాను జపము చేసికొను ప్రదేశమునకు బోవు సమయములో దొందరచే నొక చిన్న రాయి కాలికి దగిలి తటాలున నేలం బడినది. అప్పుడు సజ్జలోనున్న పుష్పములు పత్రియు సజ్జ చేయి వీడినందున భూమి మీదంబడినవి. అయ్యిందుముఖియు జయ్యన బంతివలె లఘుగతిలేచి నేలబడియున్న పూవులను పత్రిని మరల సజ్జలోని కెత్తుకొనియెను. గోపా! వినుమల్లప్పుడదృష్ట దీపుడు భువనేశ్వరికి మ్రొక్కు సమయమున నదృశ్యౌషథీలత నేలంబెట్టి మరల వెదకిన గసంబడలేదని చెప్పితినిగదా? ఆ లత ప్రియంవదపడిన చోటనున్నది. కావున దైవవశమున నాపూవులతోగూడ నది తనచేతికి దగులుటచే దానినిగూడ నా పూజాపాత్రములోని కెత్తి యాసజ్జ జేతంబట్టుకొని అక్కాంత నడచునంతలో నాచెంత దేవీసౌధము గన్నుల పండువ గావించినది.

అప్పుడప్పుడతి మిక్కిలి వెఱగందుచు నోహో! ఇదియేమి చిత్రము. ఇంతకాలమునుండి యీ కొండకు నేను వచ్చుచుంటిని. కాని యెన్నడును నాకీమేడ గనంబడలేదే? ఇది యెవ్వరిది? ఇది మిగుల నద్భుతముగా నున్నదే! ఇందుగం