పుట:కాశీమజిలీకథలు -02.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిదత్తుని కథ

231

దినము ప్రాతఃకాలమున వచ్చితినని యుత్తరము చెప్పెను పిమ్మట నది దేవా! మీ రిన్నిదినము లాలస్యము చేయవచ్చునా? మీ కొరకు మానెచ్చలి పచ్చవిల్తుని తూపుల రాయిడికిం దాళలేక దినమొగయుగముగా గడుపుచున్నది ఇప్పుడే క్రీడాశైలమునకు బోయినది. మనమచ్చటికి బోవుదమురండు. నన్ను గురుతుపట్టితిరా? క్రొత్తగా జూచుచున్న వారు! నేను దేవర దాసిని కలహంసికననుటయు హరిదత్తుడు అద్భుతబంధువార్తశ్రవణంబునంజేసి యగ్రజదిదృక్షస్వాంతమున నిత్యావృత్తాంతరీతుల నంటనీయమిం జేసి పూర్వస్మృతి యించుకయేనియులేక యంతకుమున్ను తానాపట్టణమునకు వచ్చినదియు బ్రియంవదను పెండ్లియాడదలచినదియు, జెఱసాలనుండి దప్పించుకొని పోయినదియు మరచిపోయి యది మరియొక పట్టణముగా దలంచియున్న వాడు గావున రాజపుత్రులకు దరుచు విస్మృతి సహజమైయుండుటం బట్టియు బలభద్రు డచ్చట జరిగిన చర్య లన్నియు దెల్లముగా జెప్పకపోవుటచేతను విస్మయం యభినయించుచు దాని మొగము నిదానించి చూచి యల్లన నిట్లనియె.

కాంతా! నీ ప్రసంగము చక్కగా నున్నయది. నేనెవ్వడ ననుకొని యిట్లనుచున్నదానవు. నీవు నాతో నింతకుముందెన్నడేని మాట్లాడితివా! నీ సఖురా లెవ్వతియ? నా కొరకు విరాళిగుందనేల? నన్ను గురుతుపట్టజాలక యిట్లనుచున్నదానవని పలకగా గలహంసిక దెల్లబోయి యుల్లము ఝల్లుమన, నౌరా! హరిదత్తా! నిన్ను నేను యెరుగననుకొంటిరా! నీటక్కరిమాటలకేమిలే. రమ్ము పోదము మన రాకకు వాకోకస్తని వేచియుండునని పలికినది.

అప్పుడతండు మరియు వెరగందుచు భళిరే! ఇది మిక్కిలిచిత్రముగా నున్నది. ఈ చిన్నది నా పేరుగూడ చెప్పుచునే యున్నదే! దీని నేనెప్పుడును జూచిన జ్ఞాపకము లేదు. ఈ యూరి మహిమ యిట్టిది కాబోలునని మనంబునం దలంచి దానితో మానినీ నీదారిని నీవు పొమ్ము. నేను నీతో వచ్చువాడను కాను. నీకు నా పేరెవ్వరు చెప్పిరి నన్ను నీవిదివర కెట్లెరుంగుదువని యడుగగా నది పరిహాసమునకే యట్లనుచున్నవాడని కాలక్షేపము సహింపక నిసుగుకొనుచు నిట్లనియె. ఆర్యా! నిన్నటివరకు నేనెరుగను. ఇప్పుడే చూచితిని. నీవు నాతో నింతకుమున్నెప్పుడును మాట్లాడియుండలేదు. నీపేరు నేను దివ్యజ్ఞానమున దెలిసికొంటిని. నీతో గొంచెము మాకు బనియున్నది. మీ వంటివారు పరోపకారమునకు బాటుపడరా? కావున నొకసారి యాయుద్యానవనమువరకు రండని వేడుచున్న సమయములో బ్రియంవద ఎక్కి వెళ్ళిన గుర్రపుబండి అచ్చటికి వచ్చినది

అందున్నదాది కలహంసికతో, దరుణీ! భర్తృదారిక మీ కొరకే బండి యంపినది. నీతో నెవ్వరినో తీసికొని రమ్మని చెప్పినదట. వారిని దీసికొని వడిగా రమ్మని చెప్పినది. కేళీశైలప్రాంతమందలి యుద్యానవనములో నున్నదని చెప్పను అప్పుడు హరిదత్తుడు విభ్రాంతస్వాంతుడై దానిమాటలచే నేమియుదోచక తలపై