పుట:కాశీమజిలీకథలు -01.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామిడిపండుకథ

37

టయుఁ బురోహితుం డామె యున్న యింటియొద్దకుఁ దీసికొనిబోయి తాళముతీసి యిందులో నున్నదని చెప్పెను.

అప్పు డాఱేఁ డొక్కరుఁడ లోనికరిగి యధికచింతాకులస్వాంతయైయున్న యక్కాంతపాదంబుల కెరగి యమ్మా! నేను నీకుఁ బుత్రుండ. నన్ను వేరుగా భావింపకుము. నీ సుగుణంబు లిదివరకే వినియుంటిని. ఇప్పుడు బాగుగా వెల్లడియైనది. నీ పెనిమిటి దుర్బుద్ధి పిమ్మట విమర్శింతు. ఇప్పుడు నీవలన నొక్కవిషయముఁ దెలిసికొనగోరియే యిచ్చటికి వచ్చితిని. కరుణించి వచింపుము. ఈ బ్రాహ్మణులు పరదేశుల మనియు, మార్గస్తుల మనియు, బాటసారుల మనియు, వెఱ్ఱిమూఢుల మనియుం జెప్పినను సమ్మతింపక యెద్దియో యొక నామము గలవారిగా భావించినట్లును తమ్మెవ్వరో తెలిసికొను తాత్పర్యముతోనే వారిచ్చటికి వచ్చినట్లును వారే చెప్పియున్నారు. ఆ సంవాదము విని నాకును నుత్సాహ మధికముగా నున్నది. ఈ మాట దెలిసికొనుటకే నేను మీయొద్దకు వచ్చితిని వారెవ్వరో వచింపుమని మిగుల వేడుకొనఁగా నామె కొంతసే పేమియుం బలుకలేదు. పలుమారు తన్నావిషయము చెప్పుమని వినయముతో ప్రార్థించుటచే మాటాడక తీరినదికాదు. ఆ యిల్లాలు తల నించుక వాల్చి దేవరా! నేను దుష్టురాలను గాకున్నను దుష్టురాలనై నట్లు నలుగురిలో వాదు వచ్చినప్పుడు దానికిఁ దగిన దండన యెద్దియో యట్టిది విధించుట మీకు న్యాయమై యున్నది.

మఱియు నే నా బ్రాహ్మణులకు భోజనమునకు వత్తురను తాత్పర్యముతో నట్లంటినిగాని వేరుగాదు. తమరు వచ్చినపని యెద్దియో చూచుకొనుఁ డిట్టి ప్రశ్నలకిది యవసరముగాదని పలికిన నక్కలికి పలుకుల కులికిపడి యప్పుడమియొడయ డఁమ్మా! నా కట్టి తాత్పర్య మేమియు లేదు. నిక్క మరసితిని. నీయం దింతయేని దోసంబు లేకున్కి తెల్లంబయ్యె. నే నిట్లు వచ్చినందులకు క్షమింపుము. నీ పెనిమిటి పలుమారు నాతోఁ జెప్పినను వినిపించుకొనక యట్టి విటులం బట్టియిమ్మని చెప్పిన నతండు వీరి నట్టి విటులనుకొని నన్నుఁ దోడ్కొనివచ్చెను. అట్టి నిజ మరయుటకై వచ్చితినిగాని యొండుగా దీతప్పు సైరించి వారి వర్తమాన మెట్టిదో యెఱింగింపుము మిగులఁ గుతూహలముగా నున్నదని బ్రతిమాలిన నెట్టకేల కయ్యెలనాగ యిట్లనియె.

రాజా! వినుము. నేను నీటికై బావికిఁ బోవుచుండఁ నీ బ్రాహ్మణు లిరుఁగెలంకుల నరుగు లుండగ విడిచి వీథిలో నెండలో దర్భాసనముల దింపి కూర్చునియుండిరి. అట్టివారిం జూచి వీరు చదువుకున్నవారే కాని ఛాందసులనియు గూడ స్ఫురించుటచే నట్టిదాని గ్రహించుటకై సుమీ మీ రెవ్వరని యడిగిన వారు చెప్పిన పేరులన్నియు గాదంటి. పరదేశులనఁగా భాషాభేదము గలవారికిఁ జెల్లునుగాని యేకభాషగా నున్నవారికి చెల్లదు. మార్గస్థులమనగా మనకన్న ముందు మార్గమందుండుటంబట్టి యన్నో