పుట:కాశీమజిలీకథలు -01.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయలు జనన కథ

27

పిమ్మట నక్కలశోదకంబు శుభముహూర్తంబున మంత్రిబోధచే నారాజు గ్రోలి తనకుఁగల యిద్దరిభార్యలలో చిన్నభార్యయందు ప్రీతి పెద్దగావున నాఁటిరాత్రి నాపడతిం బడకకు రమ్మని యజ్ఞాపించెను. అత్తరుణియుఁ బ్రసూతివలన యౌవనంబులకు లోపంబగునని రతిక్రీడాసుఖము బరిపూర్ణముగా ననుభవింపని దగుటచే నా రాత్రి దాను బోక తన కత్యంతాప్తురాలగు దాది నొకదానిఁ దననగలచే నలంకరించి శయ్యాగృహంబున కనిపినది. స్త్రీలకుఁ గామమును మించిన యభిలాషలేదు.

అదియు రాజుభార్యవలె నభినయించుచు మంచముకడ నిలువంబడుటయు నా రాజేంద్రుడు తజ్జలంబులఁ గ్రోలినది మొదలు మేనెఱుంగక కై పెక్కి మదోన్మత్తుండై యున్నకతంబున దానిం దనభార్యయే యనుకొని రతిక్రీడలం దేర్చెను. పిమ్మట గొండొకవడికి నొడలు దెలిసికొని నిదానించి చూచి నీచకాంతగా నెఱింగి కోపంబును శోకంబును సంభ్రమంబును మనంబున నొక్కసారి యంకురింప దానివలన దద్వృత్తాంతం బంతయు నెఱింగి కరవాలంబున దాని శిరంబు నెగవ్రేయబోయి యంతలో విమర్శించి యప్పుడ మంత్రిం దీసికొని రమ్మని నాపునొకని నంపెను. "బుద్ధిఃకర్మానుసారణి" యను వాక్యంబు దప్పుదుగదా !

విను మారీతి దాసీకేశంబు లొకచేతను గత్తి నొకచేతను బట్టికొని యట్లే నిలువంబడియుండ బుద్ధిమంతుడగు నమ్మంత్రియు నట్టివార్త విని యెట్టి యుపద్రవమైనపని జరిగెనో యని వెరపుజెందుచు నతిరయంబున నర్ధరాత్రంబున నొంటిగా రాజు నగరి కరిగి యందేకాంతగృహంబు సొచ్చి రాజును దాదియు నున్నరీతికి భీతిజెందిన డెందంబుతో నిట్లనియె.

ఓహో దేవా! యుడుగు యడుగుము. ఇంత సాహసం బాచరింపఁ బూనితి వేమి ? ఈచుతి నీయతివగాదా? యేమి తప్పు చేసినది యెఱింగింపుమని యతని కరముననున్న కరవాలము లాగికొనుటయు నారాజు మంత్రి కావృత్తాంత మామూలచూడంబుగా వక్కాణించి దీనిం జంపెద నీయభిప్రాయ మేమని యడిగిన నాప్రధాని యిట్లనియె.

అయ్యా! దీనిం జంపిన లాభమేమి? ఈ నేరం బిది యాచరించినది కాదు. తన యేలికసాని చెప్పినట్లు నడుచుకొనుట దాదుల కుచితధర్మము గదా! రాణియ బాల్యచాపల్యంబున నట్లు నడిపించినది. గానిండు గతమునకు వగవం బనిలేదు. మన మధికప్రయత్నమునఁ బడసినప్రయోజనం బూరక చెడఁగొట్టుకొనుట లెస్సగాదు. దైవసంకల్ప మీరీతి నుండ దాని మార్ప నెవ్వరితరంబు. పుత్రులలో నౌరసుఁడును క్షేత్రజ్ఞుఁడును ముఖ్యులు. దీనికి జనించినవాఁడు నీకౌరసుం డనంబరగు. వాఁ డందరకన్న నుత్తముఁ డని శాస్త్రములు ఘోషించుచున్నది. దీనికి తప్పక మంచికుమారుం