Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

గోపాలా ! బోజభూపాలుండట్లు కాళిదాసాది మహాకవులతో విద్యాగోష్టిఁ గాలక్షేపము జేయుచు నింద్రవైభవములతోఁ బెద్దగాలము రాజ్యము గావించె. నీ యుపాఖ్యానము వినిన నిహపర సాధనమైనదని చెప్పుటయు శిష్యుండ పరిమితానందము జెందుచు గురునితో నవ్వలి మజిలీ చేరెను.

క. మంగళమగు గో బ్రాహ్మణ *
   పుంగవులకు సర్వసస్యపూర్ణంబై యొ
   ప్పుంగాత ధాత్రిప్రజ లు
   ప్పొంగుచు దనరారుదురు ప్రపూర్ణసుఖములని.

గీ. బుతుహుతాశన వసుతార కేశకలిత
   సంఖ్య నొప్పారు వరిశాలిశకమునందు
   దనరు నానందనామ వత్సరమునందు
   దీని రచియించి ప్రకటించితిని ధరిత్రి.

గద్య. ఇది శ్రీమద్విశ్వనాధ సదనుకంపాసంపాదితకవితావిచిత్రాత్రేయ

మునిసుత్రామ గోత్రపవిత్రమధిరకులకలశజలనిధిరాకాకుముద

మిత్ర లక్ష్మీనారాయణపౌత్ర కొండయార్యపుత్రసోమి

దేవి గర్భశుక్తిముక్తాఫల విబుధజనాభిరక్షిత

సుబ్బన్నదీక్షితకవివిరచితంబగు కాశీయా

త్రావసథ చరిత్రమున నాఱవ

భాగము సమాప్తము.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

శ్రీ విశ్వనాధార్పణమస్తు.