330
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
కొనుచు నెక్కడికో పోవుచుండిరి. వారింజూచి మీరెందు బోవుచున్నారు! ఈ రాత్రి నాకేదియేని పని చెప్పింతురా? యని యడిగిన వారు మేము లోహశాల కరుగు చున్నాము. రాత్రుల నందు బని చేయుదుము. నీవు సమ్మెటం గొట్టెదవేని తీసికొని పోయెదము. ఆ పనివాడు నేడు రాలేదని చెప్పిరి.
ఆమాట విని రాజు రాత్రియెల్లఁ బనిచేసిన నా కేమి యిప్పింతురని యడిగిన పదారుకాసుల నిత్తునని చెప్పెను. నాఁ డా పనివాఁడు రాలేదు కావున వారికి వానితో నవసరముఁగలిగి నాలుగణా లిత్తుమని యొప్పించి తీసికొనిపోయిరి. వారందరు నొక లోహకారకుని యింటికిఁ బోయిరి. లోహకారకుడు సమ్మెట గొట్టుట రాజునకు నియమించెను. తన మృదుహస్తములతో బరువైనసమ్మెట నెత్తి కొట్టుచుండెను. పెడదెబ్బలు కొట్టునప్ప డొకటి రెండుసారులు నిదానముగా వేయుమని లోహకారకుఁడు మందలించెను. వెండియు నట్లే వేయుచుండ వానికిఁ గోపమువచ్చి కాలిన కారుతోఁ గాల్చబోయెను. అందుల కతండు తప్పించుకొని నే నెప్పుడు నీ పనిచేసి యెరుంగను. దానంజేసి నాకుఁ జక్కగాఁ దెలియకున్నది. కోపము సేయకుడు అని బ్రతిమాలికొనుచుండెను.
అతని వక్రఘాతలకు సంతత మా లోహకారకుఁడు తిట్టుచునే యుండెను. వాని ప్రతాపము లన్నియు సైరించుచు భూపాలుండు సూర్యోదయముదనుక సమ్మెట బాదుచుండెను. చేతులు రెండును పుండ్లుపడి రక్తము స్రవింపుచుండెను.
ఓరీ పశువా! ఇంత చేతగానివాఁడవీపని కేమిటికి రావలయును? నీ కతంబు నా పనికూడఁ జెడిపోయినదికదా ! పో, పొమ్ము. ఇఁక నెన్నడును మా శాలకు రాకుము. తెలియక నిన్నుఁబెట్టికొంటినని నిందించుచుఁ బదారు రాగిడబ్బులు వానికిచ్చి పంపివేసెను. రక్త వ్రణపూరితములై కరతలంబులు బాధింపుచుండ నా భోజుండాడబ్బుల మూటఁ గట్టికొని యొండేమియు ముట్టఁజాలక అక్కటా! నాకు లోకులు పడెడు నిడుమలం దెలిసికొనుటకై కష్టార్జిత ద్రవ్యం మిమ్మని యా విప్రుం డడిగెనా ? అయ్యో! పాపము కూలివాండ్రు స్వల్పవిత్తములకై యెంతపాటు పడుచుందురోకదా. నేనీ స్వల్పద్రవ్యము నిమిత్త మింత కష్టబడితిని. దీని వలన నా బ్రాహ్మణుని కొక పూటయయినఁ గడువదు. ఆహా ! కష్టార్జిత ద్రవ్యంబున నా విప్రునిదరిద్ర మెట్లు బాపువాడను. ఒకరాత్రికే నా పని తుదముట్టినది. మరియొక తెరవేదియు గనంబడదు. ఇంతకన్న నాకు శక్యముకాదని యా యనతోఁ జెప్ప వలసి వచ్చినది. అని యనేక ప్రకారముల దలపోయుచు నా నృపతి గూడమార్గమున నింటికిం బోయి స్నానముఁ జేసి జపమందిరమునఁ గూర్చుండి యా విప్రుని రాక నరయుచుండుటయు నింతలో
“కూ వొబహంసు (1
పిలు టంతలం నలంకలించన.