Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(42)

యజ్ఞశర్మ కథ

329

దేవా ! నా కాపుర మీ పురమే. నే నెన్నడును రాజదర్శనముఁజేసి యుండలేదు. నేను దరిద్రుఁడనే. విద్య లన్నియుఁ బూర్తిఁ జేసితిని. అగ్నిష్టోమముఁ జేసితిని. అగ్నిగృహము నాశ్రయించుకొని యుందు నింతకన్న వేరొక వృత్తిలేదని చెప్పుటయు బోజుండు చెవులు మూసికొని శివశివా! యెంతమాట వినఁబడినది మావీట దారిద్ర్య బీడితుండగు భూసురుం డుండెననిన నాకపఖ్యాతి కాదా ? ఇన్ని దినములను నా యొద్ద కేమిటికి వచ్చితిరి కారు? మిమ్మెవరైన రానీయ రైరా? హరహర! ఈ దారిద్ర్యమెట్లు గడుపుచున్నారు. మీ మాటలు వినఁగడు నిడుములు కడుచుచున్నట్లు తోచుచున్నదని పరితపించుచుఁ గోశాధికారిం జీరి యాపారునకుఁ గోరినంత ధన మిమ్మని నియోగించెను.

అతండా బ్రాహ్మణుని రమ్మని పిలిచినంత నత్తపస్వి దేవా ! నా విన్నప మొండువినవలయును. నేనింతకాలము మీ చెంతకు రాకపోవుటకుఁ గారణ మిదియే మీ కష్టార్జితమైన ద్రవ్య మేమైనఁ గలిగియున్న నాకీయుఁడు. ఇతరమైనది నేను భరింప జాల. అల్ప మిచ్చినను సంతోషింతునని వినయముతోఁ బ్రార్థించిన విని యారేఁ డాలోచించి యోహో? యితండు కష్టార్జితమిమ్మని యడిగెను. అట్టి ధనము నాయొద్ద నేమియున్నది? ఉన్న దంతయు రాజకీయమే. అని యాలోచించి యావిప్రున కిట్లనియె.

అనఘా ! నీవు నన్నుఁ బరీక్షించుటకై యిట్లంటివి కాబోలు ? నా యొద్దఁ గష్టార్జిత మేమియునులేదు. రాజ్యము మదీయ మగుట నందలి ధనము నాదికాదా? నీకు గావలసినంత ద్రవ్యము దీసికొని పొమ్ము. ఊరక బాధింపకుము. అని వేడుకొనిన నతండిట్లనియె.

రాజా ! నేనుపవాసములైనఁ జేయుదునుగాని పాపద్రవ్యము బరిగ్రహింప నోప. అట్టిది లేకున్న నాకనుజ్ఞ యిమ్ము పోయి వచ్చెద. వేరొకప్పుడు సత్కరింతురుగాక యని లేచి యింటికి బోవ యత్నించుటయు బోజుండు నివ్వెరపాటుతో అయ్యో? ఇంతకు మున్నే పండితుండును నన్ను యాచించి విఫలమనోరధుడై క్రమ్మర పోలేదు. ఈతండతి దరిద్రుడయ్యు బ్రతిగ్రహమునకుఁ వెరచుచు ద్రవ్యశోధనఁ జేయుచున్నాడు. ఇట్టి మహాత్ముని సంతోషపరచలేని నాజన్మ మేమిటికి? అక్కటా ? వీని దరిద్ర మెట్లు పోగొట్టుదును? నాకష్టార్జిత ద్రవ్యం బేది గలదు? అని తలంచుచు ఆర్యా ! మీరు రేపీవేళకు నిక్కడికి దయచేయుడు. ఏదియో చూచి యిచ్చువాడనని చెప్పి యొప్పించియంపెను.

అతండరిగినది మొదలు కష్టపడి ధన మెట్లు సంపాదింతునని యాలోచించుండ సాయంకాలమైనది. రాత్రియెక్కడికైన బోయి ప్రచ్చన్నముగా గూలి పనిచేసి దానవచ్చిన సొమ్మా విప్రున కీయదలంచెను.

ప్రొద్దుగ్రుంకినతోడనే ప్రచ్ఛన్న మార్గమునగోట దాటి కూలి వేషమువైచికొని వీధిలో నిలువంబడి యుండెను. అప్పుడు కొందరు కూలివాండ్రు మాటలాడి