Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాళిదాసు కథ

325

ఒకనాఁడు కుంభుఁడను వంటబ్రాహ్మణుఁడు విలాసవతి నాశ్రయించి కాళిదాసు నిద్రించుచుండ నతనికి హాయిగాఁ బాదసంవాహనముఁ గావించెను. కాళిదాసు కొంత సేపటికి నిద్ర మేల్కొని తనయడుగు లొత్తుచున్న యాపారుంజూచి యనుగ్రహముఁ గలిగి నీ వెవ్వడవు ? అకారణముగా నా పాదము లొత్తుచున్నా వేమి? నీ కేమి కావలయునని యడిగినఁ గుంభుండు నమస్కరింపుచు నిట్లనియె.

ఆర్యా ! నే నతిదరిద్రుండ పదుగురు పిల్లలు కలరు. నాకు విద్య యేమియును రాదు. వంటజేసి బ్రతుకుచున్నాను. నీళ్ళు మ్రోయుచుండ నా భుజములు కాయలు కాచినవి. అట్ల యినను గుటుంబషోషణము జరగ కున్నది. ఏమియుం జేయనేరక బలవంతమునఁ జావవలయునని ప్రయత్నముఁ జేయుచుండఁగా నొకమిత్రుఁడు మీ పేరు సెప్పి యాశ్రయింపుమని యుపదేశించెను. మహాత్మా ! నీ విదివరకు నా వంటి శుంఠలకుఁ బెక్కండ్రకుఁ జాలయుపకారముఁ జేసితివని వింటిని. భోజునికన్న నీ యౌదార్యమునకుఁ బెద్దగాఁ జెప్పుకొనుచున్నారు. నీవెద్దియేని యుపకారముఁ జేయుదువా బ్రతికెదను. లేకున్న పిల్లలతోఁ గూడ బలవన్మరణము నొందెద ననిపలుకుచు నతని యడుగులేవిడువఁ డయ్యెను.

కాళిదాసు నవ్వుచు నీ వేమియుం జదువలేదని చెప్పుచుంటివి. కవిత్వముఁ జెప్పు విద్వాంసునికిఁగాని రాజు దర్శనమీయఁడు. నీ దీనాలాపములు విన విచారమగుచున్నది. కానిమ్ము. నీయదృష్ట మెట్లున్నదో నాకుఁ దోచినసహయముఁ జేసెదనని పలుకుచు విలాసవతితోఁ జెప్పి యతనికిం గట్ట మంచి పుట్టము లిప్పించి నాఁడు సాయంకాలమున సభకుఁ దనతో దీసికొనిపోయెను.

హజరమున నిలిచి యే వేని ఫలములఁ గొనిరమ్మని రెండు కాసు లతనికిచ్చెను. కుంభం డంగడికిఁబోయి ఫలము లేమియు లేక పోవుటచే జానెడు పొడవుగల చెఱుకుముక్కలఁ గొని తీసికొనిపోయెను. వానిం జూచి కాళిదాసు నవ్వుచు నింతకన్న నీ కేమియుం దొరకలేదాఁ మేలు మేలు. ఇట్టివాని రాజదర్శనముఁ జేయునప్పుడెవ్వరును దీసికొనిపోలేదు. కానిమ్ము చూతముగదా? నీ లీ చావడిలోఁ గూర్చుండుము. నేను నీకు వర్తమూనముఁ జేయునప్పుడు రమ్ము. అని చెప్పి లోపలకుఁ బోయెను.

ఆ రేయిఁ బెద్దతడవుదనుక బోజునితో నతని తెఱ కెరింగించుట కవకాశము దొరికినదికాదు. కాళిదాసు సమయమరసి దేవా? నేడొక మహావిద్వాంసుండు మీ దర్శనము నిమిత్తము వచ్చియున్నాఁడు. నేనింతకు ముందిట్ధి పండితునిఁ జూచి యెరుం