కమల కథ
315
గృతజ్ఞులమై యుండెదమని స్తుతిఁ జేయుటయు బోజుండక్కమలంగాంచి యబ్బురముఁ జెందుడెందముతో బ్రజ్ఞావతి కిట్ల నియె.
అవ్వా ! మీ రెవ్వరు ? ఎందుఁ బోవుచున్నారు. ఆ చిన్నది నీ కేమి కావలయును. సహాయములేక నొంటరిగా దెఱ వేమిటికి నడచుచుండిరి? అని యడిగిన నా ప్రజ్ఞావతి దేవా ? అది నా కూతురు. దానిపేరు కమలయండ్రు. దానికి వివాహముఁ జేయుతలంపుతోఁ దగినవరు నరయుచు దేశములు తిరుగుచుంటిని. ఇందు దొంగలడ్డము వచ్చిరి. మీ కృపవలన నా యిక్కట్టు దాటితిమి. ఇక్కడికి గ్రామ మెంత దూరమున్నది ? మా కకారణ బంధువులైన మీ కులశీల నామముల వినఁ గోరుచున్నదాన నని యడిగెను. అంతలోఁ గమల దళ్కు చూపు లా భూపతిపై వ్యాపింపజేసినది. అతని ధైర్యము మట్టు మాసినది. చేష్టలు మారినవి. ఆ చపలనేత్ర చూపులకు బోజునిచూపు లెదురుకొని పెనవైచినవి. మనసిజుండా విలోకనములనే సాధనములుగాఁ జేసికొని నరనాధుని హృదయమును వేధింపఁ దొడంగెను.
అప్పుడయ్యొడయం డొక్కింత తెరపిఁ జేసికొని యేమంటివి ? ఆ వాల్గంటి నీ కూఁతురా ? వరునికొరకుఁ దిరుగుచుంటివా ? ఇది కడు వింత. రత్నమును వెదకుదురు గాని రత్నము వెదకువారిని వెదుకరుగదా ? ఆ చకోరకుకోరిన నేభూపతి యంగీకరింపఁడు ? నా పేరు బోజుండందురు. మా కాపురము ధారాపురము. ఈ రాజ్యమునకు నేను యధిపతి. మీరు మా దేశమున కతిధులుగా వచ్చిరి. కావున సత్కరింపవలయును. మా యింటికి రండు అని పలికినఁ ప్రజ్ఞావతి వినయ మభినయించుచు నిట్లనియె.
ఓహో ? బోజకుమారులు మీరేనా ? మీ యభిఖ్య త్రిజగద్విఖ్యాతమైనది. కడు ధన్యులమైతిమి. మృగ్యమైన రత్నము చేతికిఁ దగిలినది. ఆడఁబోయిన తీర్థ మెదురు వచ్చినదని పొగడుచు మీ యొద్ద దాచనేల ? ఈ కన్యను భరింప మీర సమర్థులు దీనిం బత్నిగాఁ గైకొందురేని మీ యాతిధ్య మందెదము. లేకున్న మా దారిం బోయెదమని పలికిన నా నృపతిలకుఁడు మొగమున లేతన వ్వొలయనిట్లనియె.
ఇందులకింత మనవియేల ? సిరిరా మోకా లొడ్డు వాఁడుండునా ? (రత్నహారీతు పార్థివః) మంచివస్తువులను రాజే భరించును. అను సామెత యుండలేదా ? నీ మాట వడువున నీ బోటిం బరిగ్రహించెద. నింటికి రండని సాదరముగాఁ బలికిన విని కమల విమలహాస చంద్రికలు వెలయ జననీ ! నీ వింత వెఱ్ఱిదానవేమి? భూ