Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

విందులకు జింతిల్లకుము. నీవు బుడమి జనియించి మహాకవి వైలోకాతీతమైన ప్రఖ్యాతినొందఁ గలవు. మీ యిరువురు నొక చోటనే వసింతురు. ఏక కాలమందే శాపవిముక్తి వడయుదురు. అని యనేకవరంబు లిచ్చి యచ్చతురాననుండు వేల్పులనెల్ల ననునయించుచు వారి నివాసదేశముల కనిపెను.

తత్కారణంబునం జేసి సురపురోహితుఁడు భూమండలమున జనియించి ధారా రాజ్యంబున బోజుండను నామంబున విరాజిల్లుచున్న వాఁడు. అతఁడే నీ పుత్రిక కనుకూలుండగు నాధుండు. అని మహలక్ష్మి యానతిచ్చిన విని ప్రజ్ఞావతి సంతసించుచు అమ్మా ! నీ యక్కటికమ్ము నట్లే కావించెద. మంచివార్త యెరింగించితివి. శారద వీణావాహకుఁడు శారదుఁ డెవ్వఁడై పుట్టెనో తెలుపవైతివి. నావుడు నవ్వుచు హరిపత్ని యోసీ ! అదియు వినవలయునా ? అతండు కాళిదాసను పేరుతో నమ్మహారాజు నా స్థానకవి యగుచున్న వాఁడని యెరింగించినది.

అప్పుడు ప్రజ్ఞావతి భార్గవీదేవియనుజ్ఞగైకొని పుత్రికతో గూడ భూతలంబున కరుదెంచినది. బోజకుమారునితో సంబంధ మెట్లుఁగలుపు కొందునని యాలోచించుచు ధారానగర ప్రాంత భూభాగముల సంచరించుచు నొకనాఁ డొకయుద్యాన వనమునకుఁ బోయి కుసుమకిసలయ ఫలద్రుములతా మనోహరమగు నయ్యుపవనరామణీయకమున కచ్చెరువందుచు నందున్న వనపాలురం జీరి యీ తోటయెవ్వరిది ? ఇప్పుడు క్రొత్తగా నరంకరించుచున్నా రేల యని యడిగిన వాం డ్రిట్లనిరి.

అమ్మా ! ఈ తోట బోజమహారాజుగారిది. వారిప్పుడు భార్యలతో విహరింప నివ్వనంబున కరుదెంచుచున్నవారు. అందులకై యలంకరించుచున్నార మని చెప్పిరి. ఆ మాటవిని ప్రజ్ఞావతి యించుక యాలోచించి బోజమహారాజుగారికి భార్య లెందరు ? పట్టాభిషిక్తుఁడై యెంతకాల మైనది? ఆయన యెన్ని యేండ్లవాడుఁ తద్వృత్తాంతముఁ జెప్పుడని యడగిన వారిట్లనిరి.

రాజ్యలోభంబునఁ బినదండ్రి చంపఁబంపి చివరకు బశ్చాత్తాపముఁ జెందుచుఁ బ్రాయోపవిష్టుండగుటయు నా రాజు మువ్వుర భార్యలం బెండ్లి యాడి యీ నడుమనే నగరమున కరుదెంచెను. పినతండ్రియైన ముంజుఁడు యోగీశ్వరు మంత్ర మహాత్మ్యంబున నతండు జీవించి వచ్చెనని సంతసించుచు వెంటనే యతనికిఁ బట్టముఁ గట్టి తపోవనంబున కరిగెను. కొలదికాలము క్రిందటనే బోజుండుసింహాసనమెక్కెను. ఆయన ------------ చిన్నది. ఆ ముగ్గురు భార్యలతో వచ్చి కొన్నిదినము లిందు