Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కమల కథ

311

అట్టి సమయంబున శారద శారదుఁడను తన వీణావాహకునిచేఁ దనవీణ మోయించుకొని యాసభకరుదెంచినది. అప్పుడు దిక్పాలురును దేవతలును సిద్ధులు లోనగువారెల్ల పీఠములనుండి లేచి యద్దేవికి వందనంబులం గావించిరి. బృహస్పతి పీఠమునుండి లేవకయే యద్దేవి నభినందించెను. అప్పుడు వాగ్దేవి నిరతిశ యరోషారుణ కటాక్షవీచియై చురుకుచూపులం జూచుచు నోరీ? దేవతాపురోహితా ? నీవును నీ వేల్పులును మా యింటికి వచ్చి మొఱ వెట్టని గడియలేదు. మాకు దాసానదాసుండైన యింద్రుయింట బాచకుండవైన నీవు నన్నిట్లవమానపరతువా ? ఈ లేచినవారెల్ల నీ మాత్రము బుద్ధిలేనివారు కాఁబోలు ? లేచినంత నే నీ గౌరవమునకు హాని వాటిల్లిన దేమి? నీవు దేవలోకంబున నుండనర్హుండవు గావు పుడమిజనింపుము. తాపత్రయ పీడితుండవైనచో బుద్ది రాఁగలదు అని శపించినది. అప్పుడు బృహస్పతి పీఠముపై నిలువంబడి క్రోధానజ్వాలలచేఁ మోము జేవురింప నోహో ? వ్యాపారస్వరూపిణీ ? పితామహునిపత్ని వైనంతనే యింతకన్నుఁ గానకుందువా ? పిన్న పెద్ద తారతమ్యము కొంచెమైన విచారింపవలదా ? పూజ్యులమైన బ్రాహ్మణులము. నీకు లేచి వందనములు చేయవలయు నేమి? ఈ మర్యాదలు మాకు దెలియవు. లక్ష్మియుఁ బార్వతియుఁ నిట్లనినఁ జెల్లును కాని నీకీ మాట చెల్లదు. నీ కిప్పుడు నేను బ్రతిశాపమిచ్చుచున్నవాడఁ జూచికొనుము. నీవును మనుష్యయోని జనియింపుమని పలుకుచు శాపోదకము హస్తంబునఁ దాల్చినంత బద్మగర్భుం డాతనిచేయి వట్టుకొని ధిక్షణా ! నీకది తగునా ? ఆఁడువాండ్రు పది తప్పులు మన్నింపఁ బాత్రలని విని యుండలేదా భారతిదేవి వెనుక ముందు విచారింపక నన్ను శపించినది. కానిమ్ము నీవు పుడమి జనించినను మహేంద్రునికన్న నెక్కుడు. వైభవ మనుభవింపఁ కలవు. నీ విఖ్యాతి భూతలం బంతయు నా చంద్ర తారకంబై విరాజిల్లఁ గలదు. నీ శాప ముపసంహరింపుమని శాంతి పరచిన బృహస్పతి విగత క్రోధుండై యిట్లనియె.

దేవా ! నే నీ యానతి నతిక్రమించువాఁడనా ? నా శాప మమోఘము. దీనిం భరించువారు వేరొకరిని జూపుము వారిపై వ్యాపింపఁ జేయుదు ననుటయు నలు మొగంబుల వేల్పునలుదెసలఁ జూచుచుండెను. అప్పుడు వీణావాహికుఁడు శారదుఁడు ----------- దేవా ! మా దేవి శాపంబు నేను వహించెద. నాపై బ్రయోగింపుఁడని పలి---------------------- బ్రహ్మ సురుగురునట్లు చేయుమని యుపదేశించెను. బృహస్పతి ------------------------ జల్లెను. అప్పుడు పరమేష్టి శారదుంజూచి యోరీ ! నీ