Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

శ్లో॥ లీలావత్యా వధూరత్న చోరః కాపొలికో హతః

లీలావతియను చిన్నదానిచే స్త్రీ రత్నమును దొంగిలించుకొని వచ్చిన కాపాలికుడు చంపబడెను. అని వ్రాసి యతం డాచీటి చేటిక కందిచ్చునంతలో జంద్రముఖి యా ప్రాంతమందున్న లీలావతి జూచి గురుతుపట్టి యట్టెఁ బోయి యొహో? నా ప్రాణరక్షకు డిక్కడ నున్నాడు. చూడక పోయితినిగదా ? ఎవ్వని నిమిత్తంబిట్టి ప్రశ్నయని కట్టడి చేసితినో యట్టి మహాత్మునకు బూవుదండ వేయఁ బోయినంత బోజుండు నిలునిలు మని వారించుచు నిట్లనియె

పూబోణీ ? నీవు నాకుఁ బ్రశ్న యిచ్చితివి. నా యుత్తరము చూడక వేరొకరి మెడలో దామము వైచుచుంటివేమిటికి? ఇది యెక్కడి ధర్మమో సమాధానము జెప్పుమని యడిగెను. అప్పుడు చంద్రముఖి కొందల మందుచు వారిచ్చిన యుత్తర మేదియని చేటిక నడిగి పుచ్చుకొని చదివి నివ్వరపాటుతో నేమిందోచక యిట్లు తలంచెను.

ఆహా ? దైవకారము కడువిపరీతమైనవిగదా ? నేను మొదటనే యాతనిం జూచితినయేని యీ సందియములు కలుగకపోవును. ఇతండు నా ప్రశ్నమునకు సదుత్తరమిచ్చెను. ఆతనిమున్నే భర్తయని నిరూపించి కొనియుంటిని. ఇప్పుడెవ్వని భర్తగావరింపవలయునో తెలియకున్నది. ధర్మసూక్ష్మము తెలియక వరించితినేని వ్యభిచారిణినగుదు. ఉభయలోకములకునుం జెడుదునని డోలాయిత మనస్కయై యాలోచించుచుండెను.

భోజుఁ డామె యిచ్చిన ప్రశ్నమునకుఁ దగినయుత్తర మిచ్చెనని యెల్లరకుం దెలిసినది? ఆమె యుల్లము లీలావతియందుఁ దగులుకొన్నదని స్పష్టపడినది. ఆమె యందీసుఁ జెందియున్న రాజపుత్రు లందరావిషయముఁ దెలిసికొని యెక్కసక్కెము లాడుటకు సన్నద్ధులైయుండిరి.

అప్పుడు చంద్రముఖి వినయవినమితోత్తమాంగయై కరములు ముకుళించి భోజ్యునుద్దేశించి మహాత్మ ! నీవు దివ్యరూప సంపన్నుడఁవు. నిన్ను వరించుట కంటె భాగ్యములేదు. ఆతండు మున్నొక నాటి రేయి భైరవాలయములోఁ గాపాలికుం బరిమార్చి నా ప్రాణములు గాపాడెను. అప్పటినుండియు నతఁడే భర్తయని తలంచియుంటిని. అందులకే యీ ప్రశ్నము వైచితిని. ఇది మీ రెట్లు గ్రహించి