Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సులోచన కథ

295

ఆ రాత్రి సత్రములో భుజించి పండుకొనిరి. దొంగ లెవ్వరో వారి మూట దొంగిలించుకొని పోయిరి‌. మరునాఁడు లేచి చూచుకొని ప్రజ్ఞావంతుండు తన యవస్థ యంతయుం దలంచుకొని దుఃఖించుచు నందున్న వారితోఁ జెప్పికొనియెను. ఈ యూరవిత్తకర్మయగు వర్తకుఁడు గలఁడు. అతఁడు మిగుల ధర్మాత్ముఁడు. యాత్రాపరులకు ధనసహాయముఁ జేయుచుండును. అతని భార్య గడుఁ దయావతి. వారియొద్దకుఁ బోయి నీయిక్కట్టు చెప్పుకొనుము. రామేశ్వరమునకు రాకపోకలకైన సొమ్మియ్యఁ గలడని కొంద రతని కుపదేశించిరి.

అప్పుడు ప్రజ్ఞావంతుఁడు తన భార్యను వెంటఁ బెట్టుకొని యా భాగ్యవంతుని యింటికరిగెను. అతని యిల్లు దేవేంద్ర భవనమువలె నొప్పుచున్నది. చావడిలోఁ దాను గూర్చుండి పెరటిదారిని భార్యను లోనికిఁబంపి యావర్తకుని భార్యతో మన యవస్థఁ దెలిపి సహాయము చేయుమని యడుగుమని చెప్పెను.

రాధికయు మెల్లన లోనికిఁబోయి అమ్మగారెక్కడ నున్నారని పరిజనుల నడుగుటయు మేడక్రింద గదిలో భర్తతో నేదియో నంభాషించు చున్నదని చెప్పిరి అల్లన నాగది ప్రాంతమునకుఁ బోయినది. రాధికకు జిన్నఁ మెత్తయిన బంగారము లేదు. పాదములకును దండలకు మెడకును వ్రేళ్ళకును రాగి రేకులును రక్షరేకులును తాటియాకు చుట్టలును తాయెత్తులును విస్తారముగా నున్నవి. ఆమె వేషముఁ జూచి వర్తకునిపత్ని వెరగు పడుచు దాపునకుఁబిలిచి అమ్మా! నీ వెవ్వతవు? ఇక్కడి కేమిటికి వచ్చితివి. మేనంతయు రక్ష రేకులు కట్టికొంటివేల? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన రాధిక యిట్లనియె.

తల్లీ ! మాది యుత్తరదేశము పుంజికయను నగ్రహారము మా కాపురము. నా భర్తకు నేను ద్వితీయ భార్యను. సులోచనయని నాసవతి యమునలోఁ బడిమృతినొంది పిశాచమై నన్ను మిగుల ‌ బాధించుచున్నది. రెండు కానుపులు మాపినది. అన్న మరుగ నీయదు. నిద్ర పోనీయదు. మాసొమ్మంతయు మాంత్రికులకును దాంత్రికులకును సరిపోయినది. చివరకు రామేశ్వరమున కరిగి సేతుస్నానముఁ జేసెనేని విడిచి పోవుదునని మొన్న నొకసోదెలో గనంబడి చెప్పినది. అందులకై రుణము చేసి యా యాత్రకుఁ బోవుచున్నారము. నిన్నరాత్రి సత్రములో మా మూట దొంగలెత్తుకొని పోయిరి. చేతఁ గాసైనలేదు. మీరు కడుపుణ్యాత్ములని వింటిమి. మమ్ము రామేశ్వరముఁ బంపిరేని మీకుకోటియజ్ఞములు చేసిన సుకృతమును బొందుదురు. పేదవాండ్రకుఁ జేసిన సహాయము కోటిగుణితము. ఇన్నియోషధులు ధరించినను పిశాచబాధ తగ్గినది కాదు. మమ్ము రక్షింపుఁడని యనేక స్తోత్రములు చేసినది.

ఆ వర్తకుని భార్య పక్కున నవ్వుచు భర్తంజేరి యీ వింతత వింటిరా? ఏ3 బ్టుకా 'సెయెట్లు పీడించుచున్న డిం మో చూచితి:-] యని నటి ఆ ంార్తటని రావ వర్తకండు వతకతో నీ నర్ట