Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నంత గంటకలకాతరు సాంద్రంబై తెరవు దొరకినది కాదు. అప్పుడప్పఁడతి త త్తిడిని మెల్లగా నడిపించుచుఁ దెరపి గనంబడి దెసకుఁ బోవుచు గంచెలం దాటుచు దొరియల నతిక్రమించుచు వచ్చిన దారియుఁ బోవలసిన తెరవునుం దెలియక తిరిగినచోటె తిరుగుచు నమ్మహారణ్యములోఁ జిక్కులు పడుచుండెను.

ఒకచోటఁ దురగమును నిలిపి సమున్నతా గ్రతంబగు నొకయనో కహమెక్కి నలుదెసలు పారఁ జూచుటయు నొకమూల ననతి దూరములో జలాశయమున్నట్లు పొడగట్టినది. ఆ దిక్కు గురుతుఁ జూచుకొని యా చిగురుబోణి క్రమ్మర వారువ మెక్కి యక్కడకుఁ బోయినది. అందుఁ గుముద కై వర మండితమైన పద్మాకర మొండు కన్నుల పండువ గావించినది.

తత్కాసారశీకరాసార చోదకములగు కుమార సమీరములు మార్గాయాస మపనయింపఁ దత్తీరధారిణి వారువమును దిగి జలములఁ ద్రాగించి యొక చెట్టునీడం గట్టిపెట్టినది. మరియు నత్తరుణీరత్నం బత్తటాకం సొంపువిలోకింపుచుండ నొక దండఁ గోవెలయొకటి కనంపడినది. ఇవ్వి జనారణ్యమం దీ దేవళ ముండుటకుఁ గతంబేమని యాలోచించుచు నందు జనులుందురను తలంపుతో నా గుడి దాపునకుఁ బోయినది. ఆ వేల్పు టింటికిఁ గవాటములైన లేవు భైరవ విగ్రహ మొకటి యొప్పుచున్నది. ఆ దేవతకు నిత్య పూజోత్సవములు చేయుచున్నట్లు కనంబడలేదు. అప్పుడప్పు డెవ్వరో పూజించుచున్నట్టి చిహ్నములు కొన్ని యున్నవి. అచ్చట విశేషము లన్నియుఁ జూచుచు నా కలకంఠి క్రమ్మర వెనుకటి నెలవునకు వచ్చి కటారి నొక తరుశాఖం దగిలించి పుట్టంబులు విప్పి గట్టునం బెట్టి దివాకర కిరణ ప్రతాపిత సంతాపము వాయ హాయిగా నా సరసీపయ పూర౦బునం దిగి తీర్థము లాడఁ దొడంగినది.

అట్టి సమయంబున నొక సార్ధవాహుఁ డా తీరమునకుఁ బారివచ్చి యందున్న యశ్వంబునుం గాంచి జను లెవ్వరో యున్నారని తలంచి నలుమూలలు సూచుచు పెద్దయెలుంగున ఓ పుణ్యాత్ములారా ! నేను దారానగరవాసిని. వర్తకుఁడ దారి తప్పి‌ యీ యడవిం బడితిని. దొంగలు తరుముకొని వచ్చిరి. నన్ను రక్షింపుడు. రక్షింపుడు. అని కేకలు వైచుచు నటు నిటు తిరుగుచుండెను. వాని యార్తధ్వని విని లీలావతి జాలిపడియు దిగంబరయై యున్న కతంబున నేమి చేయుటకు వీలులేక తన్నొరులు చూతురను సంకోచముతోఁ గంఠదఘ్నంబగు జలంబున వసించి తన మొగ మొక పద్మపత్రములవలెఁ గనంబడునట్లు వెలయించు చుండెను.

అంతలో నా బేరిం దరిమికొని వచ్చిన చోరు లచ్చటికివచ్చి నలుమూలలు వెదకి లీలావతి విప్పి పెట్టిన పుట్టంబులనెల్ల గైకొని యవ్వలకుఁ బోయిరి. లీలావతి యవ్విధం బరసి అయ్యో? ఇఁక నేనేమి చేయుదును? నా కట్టు పుట్టంబు లెత్తి కొని పోయిరి. ఇందు వే రొకచేల మెట్టుదొరక కలదు. కట్టా ! పుట్టములు విప్పి