కవి కంఠకౌక్షేయుకుని కథ
267
అట్లు వారు పరమసంతోషముతో నేపారుచుండ రెండు దినంబులకు రాజ దూతలవలన సరోజినియందున్నదని విని ఘటదత్తుండును సుముఖుండును కీర్తి సేనుఁడును వారివారి వారమును గమలాపురంబునకరుదెంచిరి. విజయదేవ భూపాలుండు వార లందరకుఁ బ్రత్యుత్తానాది సత్కారములఁ గావించి మిక్కిలి గౌరవింపుచు నానందింపఁ జేసెను.
అప్పుడు ఘటదత్తుఁడు సరోజినిం జూచు నుత్సకముతో నంతఃపురమున కరిగెను. సరోజినియు నతని రాక విని యెదురు వచ్చి పాదములంబడి నమస్కరించుచు నశ్రుజల పూర్ణనయనయై డగ్గుత్తికతో వియోగ దుఃఖమును దెలిపెను.
ఘటదత్తుండును గ్రుచ్చియెత్తి చెల్లీ ! నీ నిమిత్త మీదేశ మంతయుఁ దిరుగుచున్నాను. క్రూరసత్వంబుల కాహారమైతివని వగచితిని. నిన్ను వెండియుం జూతునని తలంచికొనలేదు. అని తాను పడిన యిడుములన్నియుం జెప్పుకొనియెను. ఆ చిన్నదియుఁ దనకథ యెరింగించి మొగంబున సంతోష మభినయించుచుఁ దండ్రీ ! ప్రీతులకు బాహ్యోపాధులు కారణములు కావుసుమీ? అనిర్వాచ్యమైన హేతువేదియో పదార్థములను గూర్చుచుండును. నీకు నా యందింత యక్కటిక మేల కలిగినదో యూహింపవలయునని పలుకుచుండగ మంజరిక యేమిటికో యక్కడికి వచ్చినది.
దానింజూచి గురుతుపట్టి ఘటదత్తుఁడు ఓసీ ? నీవు మంజరికవుకావా ? కళావతీసఖురాల విందేమిటికి వచ్చితివని యడిగిన ఘటదత్తుం జూచి యించుక వెరచుచు దేవా! మే మిప్పుడక్కడ పనిమానితిమి. కాశికింబోయి వచ్చుచు నీ దివాణము నాశ్రయించితిమి. కూలివాండ్రకొకతావు నిత్యమా? యని విని పలికిన సరోజిని అన్నా వీరిని నీ వెరుంగుదువా ? వీ రిందుమతీదేవి పరిచారికల మని చెప్పిరే ? కళావతి నెట్లెరుగుదురని యడిగిన గళావతీ పరిచారిక లనియే చెప్పెను.
ఆ మాట దానిని ముదలకించినది. అదియొక మాటకు వేరొకమాట చెప్పినది. అంతకుముందే వారియం దనుమానముఁ జెందియున్న సరోజిని యప్పు డాపని వీరే చేసినవారని ధ్రువపరచినది.
తరువాత సరోజిని తమకథ యంతయు ఘటదత్తున కెరింగించి నీవు కళావతి కుమారుఁడవట. నేను గౌముది పుత్రికనఁట. వసుంధరుడే మన తండ్రియట. ఈ వృత్తాంత మీ దాదులు చెప్పియున్నారు. ఈ కపటక్రియలు చేసినదియు వీరేసుఁడి యని చెప్పి వాని నానంద సాగరమున దీర్థమాడించిరి.
విజయదేవభూపాలుండును ఘటదత్తుఁడు వసుంధరుని కుమారుఁడని కీర్తి సేనున కెరింగించి తనకూతు రింద్రదత్త యతని వరించిన కథయుంజెప్పి యతనికి సంతసము గలుగుఁ జేయుచు నతని యనుమతి నా చరిత్ర యంతయుఁ బత్రికలపౌ వ్రాయించి దూతలకిచ్చి వివాహశుభలేఖలతోఁ గూడ వసుంధరునొద్ద కనిపెను.
వసుంధరునిభార్య కళావతి మంజరికయుఁ బాటలికయుఁ బారిపోయిరను