260
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
వోలెఁ బ్రచండభండనముఁ గావింపుచున్న యా ఘటదత్తుని వ్రేటులకు నిలువలేక హత సేషులు పారిపోయిరి.
అట్లు రెండు గడయలలోఁ జాలమందిని జయించిన యా మహావీరునిఁ జూచి సుముఖుఁ డుత్తరుడువోలె విస్మయాయత్తచిత్తుండై యతనిం గౌగలించుకొని మిత్రమా ? నీవు మనుష్య మాత్రుఁడవుగావు. ఈశ్వరాంశ నీయందున్నది. నీ యభీష్టముఁ దీరినది. కసిదీర వారి సేనల మర్దించితివి గదా ? ? ఇఁక మా పురమున కరుగుదము రమ్ము. నీకు మంత్రిత్వ మిప్పింతునని పలుకుటయు నతం డిట్లనియె.
రాజపుత్రా ! సరోజినిజాడఁ దెలిసికొనక నెక్కడకురాను మఱియు మఱియు వెదకి చూచెద నాతోఁ దిరిగి నీవు చాల నలసితివి. నీవు కడు సుకుమారుఁడవు. ఇంటికిఁబోయి సుఖింపుమనుటయు నతండు చాలుఁ జాలు. నేనందుల కనుట కాదు. నీ వధికార పదవిఁ బొంది గజాశ్వాందోళికాదులతోఁ దిరుగ వచ్చునని పలికితిని. నిన్ను విడచి పోవుదునా ? లెమ్ము. లెమ్ము. ఆ కొమ్మను వెదకుమని తొందర పెట్టెను. తిరుగనప్పురుషశ్రేష్ఠు లిరువురు నత్తరుణీమణి నందందు వెదకుచుండిరి. ఒక గ్రామములో దేవాలయము గోపురపు ముఖకుడ్య భాగమున మూఁడు ప్రకటన పత్రికలు కనంబడినవి. వానింజదువ నిట్లున్నది. మొదటిది ఘటదత్తుని బట్టికొని కట్టి తీసుకొని వచ్చినవారికి మూడు గ్రామములు కానుకగా నీయఁబడును. కాళిందీనగరభర్త కీర్తిసేనుఁడు రెండవది ఘటదత్తుడను బ్రాహ్మణ కుమారుని దీసికొని వచ్చినవారికి నపార పారితోషికము లీయబడును. కుముద్వితీ పురపాలకుఁడు వసుంధరుఁడు మూడవది ఘటదత్తుఁడను చిన్నవానిం దీసికొనివచ్చిన వానికి వేయి దీనారములు కట్టనమీయ గలవాఁడను. ఇట్లు కమలాపురాదీశ్వరుఁడు విజయదేవ భూపాలుఁడు. ఈ మూడు పత్రికలం జదివికొని ఘటదత్తుడు సంతసించుచు, ఆహా ! దైవము నాకిప్పుడించుక సముకుఁడైనట్లు తోచుచున్నది. నాయందత్యంతాగ్రహవ్యగ్ర చిత్తుండైన నాగురుండు వనుంధరుఁడు నారాక నభిలషించుచున్నాఁడు పోనిమ్ము. ఇదియు నొకశుభమే. అయ్యో? ఇంద్రదత్త తండ్రి విజయదేవుఁడు కూఁతురు ప్రోత్సాహంబున నీ పత్రిక వ్రాసి యుండును. హా ! సరోజినీ ? ఇట్టి సంతోషము నీవుండగఁ గలిగినది కాదు. నీ బుద్ది కౌశల్యమున నాయింతి స్వాంతము నన్ను గురించి కంతుసంతప్త మగనట్లు చేసితివి గదా? అని దుఃఖించుచు నేరా ! కీర్తిసేనుఁడా నీ పగ పాముపగకన్న గొప్పదిగదా? నా నిమిత్తము మూఁడు గ్రామములు దానముఁ జేయచుంటివి. బాపురే? నీ త్యాగము గొనియాడదగినదే గురునికంటెను మామకంటెను నా నిమిత్త మెక్కువ కరుచు చేయుచుంటివి. అని బీరములాడుచు సుముఖునితో మిత్రమా ! ఇప్పుడు నా నిమిత్తము మువ్వురు వార్తలనంపిరి. ముందెప్పటికిఁ బోవుదము ?