Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభావతి కథ

229

ధము వాసి యాసీమంతినీమణి వడివడ నడచుచు గురుమందిరమున కరిగి యతండు పండుకొను నెల వెరిగిన దగుట నటకేగి గుర్రు వట్టి నిద్రపోవుచున్న యాచార్యు మేనిపై మెల్లనచేయి వైచి ఆర్యా ? ఆర్యా ? లెమ్ము లెమ్ము అని పిలిచినది. అతం డదరిపడి లేచి కన్నులు నులిమికొనుచు నెదుర విభూషణప్రభలచేఁ గన్నులకు మిరుమిట్లు గొల్పుచున్న ప్రభావతిం జూచి గురుతుపట్టనేరక భూతమో కామినియో తన్నుఁ జంపవచ్చినదని నిశ్చయించి మాటరాక యదరిపాటుతోఁ బారిపోవ నటునిటు చూచుచున్నంత నక్కాంతారత్నంబు ఆర్యా ! వెరవకుడు. నేను మీ శిష్యురాలను బ్రభావతిని. నాడు మీతో నాడిన మాటవడువునఁ బతియనుమతి వడసి మీ యొద్ద కరదెంచితిని. మీ యిష్టముఁ దీర్చుకొండని పలికిన నులికిపడుచు నప్పండితుం డయ్యండ జగమనపాదంబులకు సాష్టాంగ మొరగుచు నిట్లనియె

తల్లీ ! నీవు త్రిలోకమాతవు. నీ శీలం బెరుఁగక మదాంధుఁడనై నిన్నుఁ గామించినందులకు నా తల నూరువ్రక్కలు కావలసినది. నీ యక్కటికంపు పెంపున నప్పని జరిగినదికాదు. నా చదువంతయు గంగపాలు సేసితిని. వివేకము నీటఁ గలిపితిని. సీ ! నే నొక బ్రాహ్మణుఁడనా ? పుత్రికవోలెఁ జేతిలోఁ బెరిగిన నిన్నుఁ గామింతునా ? అయ్యారే ? నీ సత్య వాక్ప్రౌడిమ హరిశ్చంద్రాదులకుఁ గలదా ? అయ్యో ? ఇట్టి యర్దరాత్రమునఁ బాదచారిణివై యీ కటికిచీకటిలోనిక్కడికి వచ్చితివా ? మహాపతివ్రతవు, నిన్ను నేను ముట్టిబ్రతుకఁగలనా ? నీ పాదరేణువు నా శిరంబున సోకింపుము. నా పాపంబు లెల్లఁ బటాపంచలై పోవగలవని యనేకవిధముల స్తుతియించుచుఁ దన్ను నిందించుకొనుచున్న కళానిధి నుపలక్షించి యాపద్మాక్షి యిట్లనియె.

ఆర్యా ! నీవు మది కుదురు పరచికొమ్ము. కొంకవలదు. నీ యభీష్టముఁ దీర్చికొమ్ము. నీ నిమిత్తమై నా ప్రాణేశ్వరు నెంతయో బ్రతిమాలికొంటినని పడింబదిగ బోధింపఁ దొడంగినది. అతం డేమియు నంగీకిరింపక యప్పుడే లేచి పసపును చీరలను గానుకగా నిచ్చి తల్లీ ! నీవు మా యింటికి వచ్చితివి వీనిం గొని పొమ్ము. పుత్రికాతుల్య వగు నిన్నర్చింపతీరదని పలుకుచు బ్రతిమాలికొని యాపతివ్రత నింటి కనిపెను.

ఇట్లు ప్రభావతి విప్రభావంబు భావజక్రీడావిముఖం బగుటకు మిగుల సంతసించుచు నటఁ గదలి దొంగలున్న నెలవునకు వచ్చి వారిజాడ నరయుచున్నంత నొకదెసనుండి వాండ్రు పరమసంతోషముతో వచ్చిరి. అన్నలారా ? యిదుగో నేను వచ్చితిని. మీయాభరణములం దీసికొనుడు వేగ నింటికిఁ బోవలయు. మీకుక్కటికంబువలన నేఁ బోయినకార్యంబు వేరొకరీతిం దీరినది యనుటయు నా ------- గాండ్రిట్లనిరి.

అమ్మా ! నీవు పార్వతివో లక్ష్మివో కాక సామాన్యస్త్రీవి కావు. నీ