Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(29)

ప్రభావతి కథ

225

వేరొకగతిఁ బరిపూర్తి నొందించెద. నా వుఁడు తటాలున లేచి చిగరుకుబోణీ ! నీ వార్తాత్రాణపలాయణవు. ఎట్లు తీర్తునో చెప్పుమని యడిగిన నయ్మెలనాగ యిట్ల నియె.

సతికిఁ బతి యనుమతిని బరపురుషుఁ గూడినఁ బాతకము లేదు గదా ? నాకు వివాహమైన పిమ్మటఁ బ్రధమసంగ మదిపసంబురాత్రి బ్రాణేశ్వరుం గూడక మున్న పతింబ్రార్దించి నీ పజ్జ కరుదెంతు నప్పుడు నీయభిలాషఁ దీర్చుకొమ్ము. దాన ధర్మలోప ముండదని పలికిన నతండు రాచపట్టీ ! నా కర్మము వేరొకరీతినుండ నీచిత్తవృత్తి యెట్లు మరలును ? పతియనుమతి వత్తునన్నమాట నా గన్నీరు దుడుచుటకుఁ గాని వేరొకటి కాదు ఎట్టివాడైన మఁగడిందులకు సమ్మతించునా ? పోనిమ్ము నీ వింటికిం బొమ్ము. నేగాటికిం బోయెదనని గన్నీరుఁ గార్చుచు వాక్రుచ్చెను.

అప్పుడాచిన్నది పదిమాటలతోఁ బనిలేదు. నాఁడురాత్రి నేను మీయొద్దకు రాకపోయితినేని గురుహత్యాపాతకమునకుఁ బాత్రురాలనగుదును. ఇంతకన్నఁ జెప్ప వలసిన పనిలేదని పలుకుచుఁ తాను దెచ్చిన దీనారములు (మొహరీలు) అందుఁ బోసి యతం డర్దినిమీలనదృష్టులతోఁ జూచుచుండ నింటికిం బోయినది.

వెంటనే యావాల్గంటినిఁ తండ్రి భానుమంతుఁడను రాజకుమారునకిచ్చి వివాహము కావించెను. మరియుఁ బ్రధమ సంగమదివసంబున

సీ. చలువజల్తారు దువ్వలువ కుచ్చెలయంచు
             ముత్తెముల్‌ నఖరదీపులకు మ్రొక్క
    మలచి నిద్దంపుకమ్మలఁ జెక్కు మగరాల
             తల్కులక్ష్మి ప్రభావతి నుతింప
    నెరిచొకాటంపు కస్తురిబొట్టు కుంతల
             చ్ఛవులతోఁ గలసి యిచ్చకములాడ
    గులుకుగుబ్బలహోయుల్‌ వెలయించు పసిఁడి కం
             చుళీ నిగ్గులొడలి రోచుఁభజింప

గీ‌ గిలుకుమట్టెల నినదంబు లలితకనక
   నూపురారావములును మనోజ్ఞరత్న
   సారసన కింకిణి థ్వనుల్మీరభర్త
   సెజ్జ కరుదెంచె నా సరసీరుహాక్షి .

అప్బప్మోఃవ వరఠియు( గొంత సెపు?ల. ఏం నంంచులంి సం పతి 8336 (పీతి గలుగ చేయుచు. గొంతపంచయము; గలిగిన పిమ్మట ళన మ్మాంనం వేస్పకొన చెప్కులు నంద్దు. పెట్టుతప హస్‌? క. గజ 1 పసేళ్ళిం.. థన్‌ మాస కపుూత బ్రలనుప్కంపంపాం వి సుం 492 లోపలపలన వసి: సా పంటి ఫా