సరోజిని కథ
215
పట్టిజనుల దర్పమునఁ జేతులుగాళ్ళు
గొఱికి కన్నముదూఱి యుఱికిచనుట
గీ. యొడలి తొడవులు దెలియక యుండఁ గత్తె
రించుటయు వెరపించుటయును
నాదిగా గల చౌర్య క్రియావిశేష
ముల నశేషముగా వాండ్రు దెలిపి రపుడు.
ఏ నట్టి విశేషము లన్నియుం గ్రహించి తత్ర్కూర చేష్టితములకు వగచుచు చేయునదిలేక వారితోఁగూడ గొన్ని దినములు దశాటనముఁ గావించితిని. ఇక తరువాయి కథ నీకుఁ జెప్పరాదు అయినను నీ సుగుణంబులను మెచ్చికొని వక్కాణింపుచుంటి వినుము. మే మీగ్రామమువచ్చి బది దినములై నది. ఈయూరఁగల భాగ్యవంతుల మర్మము లన్నియు గ్రహించితిమి ఈ యారికెల్ల నీ తల్లి సంపద యతిశయిల్లి యుండుటఁ దిలకించి దానిపని పట్టఁదలంచి మొన్ననొక చాకలివాని యింటికిఁ గన్నము వైచి మంచి మంచి పుట్టములఁ దోచికొని వచ్చిరి. ఆ దుస్తుల నన్నలంకరించి నాకు రాజవేషము వైచిరి. వాండ్రు పరిచారిక వేషములు వైచికొనిరి మేము నిన్నరాత్రికి మీ యింటికి వచ్చి తాంబూల మిచ్చితిమి. మా వేషములు చూచి నీ తల్లి యుల్లము వికసింప గ్రామములు దొరుకునని సంతసించుచు మారాక కంగీకరించింది మేమందరము లోపలఁ బ్రవేశించితిమి. వాండ్రు నలువురు గజదొంగలు. గృహ మర్మము లన్నియుం దెలిసికొని మీ సొమ్మంతయుఁ గొల్లబెట్టఁ దలచికొన్నారు. ఇదియే నా వృత్తాంతమని చెప్పుచుండగనే యా తస్కరులక్కడికి వచ్చి ఘటదత్తా ! తలుపు తీయుమని యరచిరి. అదరిపడి లేచి ఘటదత్తుఁ డాగది తలుపు దీసెను. సరోజిని జడిసి తలుపుచాటున దాగికొన్నది. వాండ్రు నలువురు లోపలఁ బ్రవేశించి యోహో ? నీవింత జాగు చేయుచుంటివేమి? దానికూతు రెందున్నది ? మేమవ్వలిపని యంతయుం జక్క పెట్టితిమి. చంద్రవతిం బట్టికొని చేతులు విరిచి స్తంభమునకుం గట్టి బంగారము మణులును పోగుచేసి మూటలంగట్టి వచ్చితిమి. ఇఁక నిందలి మండవములం గొనవలయు. నీవిందేమి చేసితివి ? దానితోఁ గ్రీడించుచుంటివా యేమి యనియడిగిన నతం డిట్లనియె.
నే నేమియుం జేయలేదు. దాన కూతుఁరు కడు ముద్దరాలు. దాని యిడుములఁ జెప్పుకొనుచుండ వినుచు నప్పనికి జాగు చేసితిని మన్నింపుఁడు. అనుటయు చాలుఁజాలు ఇదియా ? నీ వేషము ఏది దానిం జూపుమని పలుకుచు నలువురు ---------- తలుపు వెనుక నాకనకగాత్రిం జూచి తలయూచుచు నిట్లనిరి.
ఏరా ? నీ వెంత ద్రోహివిరా ? చక్కని యి క్కుసుమకోమలితోఁ నీవేమిచేయుచుంటివి ? మన మనుకొనిన మాట యేమి ? నీవు చేసిన పనియేమి? కానిమ్ము. తర్వాత విచారింతుములే. పదపద. వస్తువుల మూట గట్టుము. అని