Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

రాజు మందిరములోనే చేయునట్లు నియమించెను. ఒకనాఁడు వాని నంతఃపురమునకుఁ దీసికొనిపోయి యిరువురు భార్యలకుంజూపి తదీయగుణ గౌరవముల స్తుతిపూర్వకముగా వక్కాణించెను. వానిం జూచి కళావతి కన్నీరు నించినది. కౌముది తలయూచుచు నించుక మందహాసముఁ గావించినది. ఆ రెండు చిహ్నమును చూచి వసుంధరుఁడు శంకాకళంకిత స్వాంతుఁడై మరియొకప్పుడు కళావతిం జూచి నాఁడు నీవు ఘటదత్తుం జూచి కన్నీరు దెచ్చుకుంటి వేమిటికని యడిగిన నప్పడఁతి యిట్లనియె.

నాధా! నాఁడు నా కానుపట్లు చెడినది. కానిచో నీపాటి కింత ప్రాయముగల కమారుం డుండునుగదా? ఇట్టి కుమారుండే మన కుండిన మీరెట్టి యానంద మనుభవింతురో? సమాదానపరిచయముననే యింత మురియుచున్నారని వెనుకటి కథ జ్ఞాపకము వచ్చుటచేఁ గన్నీరు నించితిని. ఇంతకన్న వేరొక కారణము లేదని చెప్పినది తరువాతఁ బ్రత్యేకము కౌముదిం బిలిచి నీవా ఘటదత్తుంజూచి తల యూచుచు నవ్వితివేల? నిక్కము జెప్పుమని యడిగిన నాచతుర యిట్లనియె

దేవా ! దేవరవారు సకల విద్యాపారంగతులు వసుంధరాధురంధరులై యున్నారు. ఇట్టివారు మమ్మల్వ విషయములకు శంకించిన నేమి చెప్పఁగలము? ఎట్టి హితుండైను దరుణవయస్కుండైన రూపవంతు నంతఃపురమునకు క్షత్రియుం డెన్నఁడును దీసికొని వచ్చుటకు సమ్మతింపఁడు. బ్రాహణప్రభువులు గావున మీరిట్టిపని చేసితిరని నవ్వు వచ్చినది. మరియుం దదీయరూప వైభవము లో సేచనకములై యున్నవి కావున విస్మయముఁ జెంది తల యూచితిని. ఇదియే కారణమని చెప్పిన విని యతం డసూయాగ్రస్తమానసుండై యిట్లు తలంచెను.

ఔరా ! నన్నీ రాచపట్టి యెట్టి యాక్షేపణఁ జేసినది. అవును. వయసువాని నంతఃపురమునకుఁ దీసికొనిపోవుట నాదియేతప్పు. స్త్రీహృదయ మతి చంచలమని యెరింగియు వెర్రిపని చేసితిని. అతి సుందరుండైన పరపురుషనిఁ జూచినప్పు డెట్టి యువతికిని మనసు వ్యభిచరింపక మానదు. నా శాస్త్రపరిశ్రమ యంతయు నిష్పలముఁ జేసితిని. మత్తకాశినిని విత్తముంబోలె నొరులవలన నపాయము నొందకుండఁ గాపాడుకొనుచుండ వలయునని యార్యులు సెప్పియున్నారు. ఆ మాట మరచి పుత్రతుల్యుండు గదాయని తీసికొని పోయితిని వీనియందుఁ గౌముదిడెందముఁ దగిలికొనినది. సందియములేదు. చూపుల చాపల్యమే తద్వికారముఁ దెలియఁ జేసినది. మాటలలోఁ గూడ నట్టి తొణకు తేటపడుచున్నది. కానిమ్ము. మరియొకసారి పరీక్షంచి కర్తవ్యమాలోచించెదంగాక యని నిశ్చయించి నాటంగోలె నంతర మరయుచుండెను.

మరి యొకనాఁడు వసుంధరుఁడు రాయల వారియొద్ద కరుగవలసిన పని వచ్చుటయుఁ గౌముది నందుంచి కళావతిని మాత్రముఁ తీసికొనిపోవుచు ఘటదత్తునిఁ గూడ రమ్మని పయనముఁ జేసెను. అతండు మొదట నంగీకరించి ప్రయాణ సమయ