Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

178

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యింద్రజాలముకాదు. మహేంద్రజాలము. కాంతిసేనం గాచికొమ్మని చెప్పుము. అని మీసములు దువ్వుచు పలికన విని యక్కలికి లేతనవ్వుమొగమున మొలగ లెత్త బావా ! నీ వింతకోపము సేసిన నెట్లునిలువఁగలము. రాజపుత్రిక తొందరపడి నీ కపకారముఁ జేసినమాట వాస్తవమే. ఇప్పుడే పశ్చాత్తాపముఁ జెందుచున్నది. నిన్ను రప్పింపవలయునని ప్రయత్నము చేయుచున్నది. ఈవన మెక్కడిది ? ఈతఁడెవ్వఁడు? ఈతండు మహేంద్రజాలవిద్యానిపుణుండా యేమి? నిజముజెప్పుమని యడిగిన శంతనుం డిట్లనియె.

కేసరిణీ ! రాజపుత్రిక నా విషయమై పశ్చాత్తాపముఁ జెందుచున్నదిగదా కానిమ్ము. యీతఁడు కుశద్వీపాధిపతి కుమారుఁడు. వీరసేనుఁడు రూపంబున మన్మధుని మించినవాఁడు. మహేంద్రజాల మీతనిచేతిలో నున్నది. మీ రాజపుత్రిక కల్పనలేమియు నిందు సాగవు. బుద్ధి కలిగిన నా మాటలు వినుము. మా విద్యలు మా కిచ్చి య చ్చిగురుబోణి నీ రాజపుత్రిని బెండ్లియాడమని చెప్పుము. అట్లయిన నే కొఱంతయు నుండదు. లేనిచో మీ రాజ్యము‌ నధీనము జేసికొందుము. అని వీరావేశముతో నుడివెను.

ఆ మాటలు వినియు వినిపించుకొన నట్లభినయించుచుఁ గేసరిణి మెల్లన వీరసేనుఁడున్న మేడకుఁ బోయినది. అతండు దానిం జూచి నీవెవ్వతెవు ? ఏమి వచ్చితివని యడిగిన నది నమస్క_రించుచు దేవా! నేను గాంతిసేన పరిచారికను. నా పేరు కేసరిణియండ్రు. మా రాజపుత్రిక మీ రాక విని సంతసించుచు నన్ను మీకడ కంపినది. మీరే మాకుఁ బూజ్యులుగదా ! యని పలికిన మందహాసముఁ జేయుచు నతం డిట్లనియె.

కేసరిణీ ! మీ‌ రాజపుత్రిక విప్రస్వములు హరియించిన దఁటకాదా ? అట్టిపాతకుల పూజ మేమంగీకరింపము. కరభ శరభ శంతనులు మమ్ము శరణుఁ జొచ్చిరి. సామమున వారిసొత్తు వారికిచ్చిన లెస్సయే ! లేకున్న బలాబలములు చూచు కొందము. నీవు పోయి నామాటగాఁ జెప్పుమని పలికిన నక్కలికి యిట్లనియె.

మీరు వారు సెప్పినమాటలే విని మా రాజపుత్రికపై నలుగుచున్నారు. ఆమె కడు నుత్తమురాలు. వీరిలో నొకఁడు కుమ్మరియు నిరువురు పంచాగము చెప్పెడి బ్రాహ్మణులు. ఇట్టివారు పెండ్లియాడమని నిర్భంధించిన

| రత్నము రాజులమొద్దనే యుంపంపగినటి.. 1; యళ్య-కువకంటి ఎ వంటి సుందరపుకుః ఫలనుపిలి యాపేడపాజలుల వరింపండగినవా ? ఇది చక్కగా నాటీచంది పం, కాజప్పుతిక ముప్పుదు. తగల. నరయుకున్నం స్తం టరే భర్డలు తభగలరు, ౧-౧: మ్య మాలలు తా న. గలుగ జేసినది.

అట్రిపొత