Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

కరభశరభుల కథ

159

చుండిరి. ఎక్కడనై న వివాహయోగ్యమగు కన్య కాన్పించినపుడు దాని తల్లిదండ్రుల కడఁ గామగ్రీవుండు మహేంద్రు నంతవాఁడని పొగడుచుందురు. వారి పరోక్షమున నితండు కడు వృద్దుఁడు. పెండ్లి చేయుమని మమ్ముఁ జంపుచున్నాఁడు విత్త మున కాసపడి వీనికిఁ బిల్లనెవ్వరిత్తురని పలుకుచుందురు.

అట్లుఁ గొంతకాలము దేశములు తిరిగిరి. కామగ్రీవునికి వివాహమైనది కాదు. శరభ కరభుల యభిలాషలే తీరినవి. అతనికి. బ్రాణోత్క్రమణసమయంబు వచ్చినపు డిఁకఁ బెండ్లి కాదని నిశ్చయించి కామగ్రీవుఁడా విద్యలు రెండు చెరియొకటియు నుపదేశించి ప్రాణములను వదలెను.

అట్లు శరభ కరభులు కామగ్రీవునివలన నా విద్యలు గ్రహించి యతని కపర సంస్కారముఁ గావించి యొండొరు లిట్లు నియమముఁ జేసికొనిరి. శరభా! నీ కింద్రజాలము నాకుఁ బరకాయ ప్రవేశవిద్యయు నుపదేశించెగదా! మొదటినుండియు నా కింద్రజాలమునం దభీష్ట ముండునది. మన యిరువుర మెవ్వరి విద్యలవలన లాభము వచ్చిననను సమముగాఁ బంచుకొనవలసినదియెగదా ? నాకు దానియం దభిలాషగా నున్నది. నా విద్య నీ కిచ్చెద. నీవిద్య నాకిమ్మని కోరిన శరభుం డనుమోదించుచు నతని వలనఁ బరకాయ ప్రవేశవిద్యను గ్రహించి తన విద్య వాని కుపదేశించెను.

అప్పుడు వాండ్రు పరమసంతోషముతోఁ దిరుగుచు నొకనాఁడొక పట్టణమునకుఁ బోయి తమ యింద్రజాల ప్రభావముఁ జూపి యా భూపతి నొప్పింపఁ దలచిరి కాని యాఱేడస్వస్థుండైయున్న కతంబున వినోదముఁ జూప నవసరము కలిగినదికాదు. అప్పుడు శరభుఁడు అయ్యో ? ఈ రాజు రోగపీడితుఁడై యున్నవాడు. రెండు మూడు దినములలోఁ గడతేరగలడు అప్పుడు వీ డాతని దేహములోఁ బ్రవేశించి రాజ్యమేలును. నా యింద్రజాల మేమిఁ జేయుదును ? గురుఁ డుపదేశించిన విద్య నిష్కారణము వానిపాలుఁ జేసితిని. నా వంటి పసర మెందైన గలడా ?

కరభా! గురుఁడు మన కే యభిప్రాయముతో నీ విద్యలని నిచ్చె యట్లే యుంచవలయుంగాని మార్చికొనరాదు. మనము తప్పుపని చేసితిమి. అది గురుద్రోహమగును కావున నావిద్య నాకిమ్ము. నీవిద్య నీ కిచ్చెదనని పలుకుటయు నతఁ డట్టిదిగా నిశ్చయించి వానివలన నింద్రజాలము విద్య గ్రహించి తనయొద్దనున్న విద్య వానికిచ్చి వేసెను.

ఇంతలో రాజభట్టులు వారిని వెదకికొనుచు వచ్చి మాఱేనికి రోగము కుదిరినది. వినోదములు చూడవలయునని కోరుచున్నాఁడు. మీ రింద్రజాలవిద్య నెరుఁగుదు

పింవుడని పిలిచిరి. అ న్తువిని భరరుండు పీఃవీః నేప వ. వాఖ బంశినట. వయిలు చూచునంట.. ఇప్పుడు "హాము కాగలదు. నా పరకాయ థి నేమి జేయుదును. ఇంతలో