Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

కూతురు :- ఇందులకు నీవు విచారింప నక్కరలేదు. పిమ్మట నీవే యాశ్చర్యపడగలవు.

తల్లి :- అదియేదియో వెళ్ళగ్రక్క రాధా ? దాచినలాభమేమి ?

కూతురు :- నీ మనుమరాలి కాలిలో నేమియున్నదియో చూచికొనుము. పిల్లా! నీ యరికాలు ముసలిదానికిఁ జూపుము. (అని పెండ్లికూఁతురుతోఁ జెప్పు చున్నది.)

తల్లి :-- (చూచి) కాలిలోనేమి యున్నది. దుమ్ము ధూళి యున్నది.

కూతురు :- తిట్టక - నా మాట మెల్లగా విందువేని యంతయుం జెప్పెదను వినుము. దీనికి‌ జక్రవర్తి యగు కుమారుఁడు పుట్టగలఁడు. శంకరుఁడతని కట్టి వరమిచ్చెనని యా కధ యంతయు జెప్పినది.

అప్పుడా వృద్ద మరియు నురము బాదుకొనుచు అయ్యో ? అయ్యో ? ఆ మాయలతొత్తు కొడుకుమాట మీ రేల నమ్మితిరే? వాఁడెక్కడ ? తపమెక్కడ ? శంకరుడెక్కడ ? ప్రత్యక్ష మెక్కుడ ? అక్కటా ! ఎట్టివ్యూహముఁ బన్నెను. మీరు గాక యీ కల్పన మెవ్వరై న నమ్ముదురా ? పిల్ల గొంతును గోసితిరి. వీనికి సంతానము కలుగునా ? రోగములపుట్టయఁట ఛీ! ఛీ! అందులకే యీ యగ్రహారములో వా రందరు మీ కథ ప్రహసనము లాగునఁ జెప్పుకొనుచున్నారు. శంకరుఁడు కనఁబడినందులకు నిదర్శన మేదియేని జూపింప మనుము అప్పుడు నమ్మవచ్చును. అని యూరక వగచుచుఁ బెండ్లి కూఁతు నెత్తుకొని మొత్తుకొనఁ దొడంగినది. కూఁతురు తెల తెలఁ బోవుచుండెను. ఇంతలోఁ గర్దముఁడువచ్చి‌ యత్తగారి విచారమువిని కౌశికునిం జేరి నీకు నీశ్వరుఁడు గనంబడెనంటివిగదా ? దృష్టాంతమేమని యడిగిన నతం డారు వేళ్ళు చూపుటయు నందలి భావమేమన పుడు నిఁక నారుమాసములకు నా మహిమఁ జూపఁగలనని సూచించెను.

అప్పుడు మిగిలిన కార్యమునకు వగచుట నిరర్థకమని తలఁచి క్రమముగా విరక్తిఁ జెందిరి. ఆరుమాసములై న వెనుక వాని దుశ్చేష్టితము లన్నియు వెల్లడి యైనవి. ఆ దంపతులు నెత్తి మొత్తుకొనుచు లోలోపల దఃఖించుచుఁ గొన్ని కొన్ని యొరులకుం దెలియనీయక వాని నుత్తముఁడేయని పొగడుచు వాని మూలమున బంధువుల కందరకు విరోధులైరి. కొన్ని నెలల కా చిన్నది యీడేరటయు నప్పుడు పునస్సంథాన మహోత్సవముఁ గావించిరి. వెంటనే చికిత్సోత్సవముగూడఁ జేయవలసి వచ్చినది.

మరికొంత కాలమునకుఁ గొమరుం డుదయించుటయు వానికిఁ జక్రవర్తియని పేరు పెట్టెను. రాజ్యమేదియని మామగారడిగినఁ గౌశికుఁ డెవ్వనియింటికి వాఁడే చక్రవర్తి. రాజ్యముతోఁ బనిలేదని యుత్తరముఁ జెప్పెను. మరియు నెవ్వరేని నీ శంకరు వరమేమైనదని యడిగినప్పుడు మనుష్యులవలె దైవములుగూడ మాయలు






నో