శబరదంపతుల కథ
127
సిద్ధతీర్థముకథ
దేవా ! మా చరిత్రము కడువిచిత్రమైసది. వినుండు. దివ్యక్షేత్రంబుల ప్రభావంబు లజ్ఞులకెట్లు తెలియును. తొల్లి మేము మువ్వురము బాలురము మార్గంబునం గలుసుకొని యిప్పురమున కరుదెంచి సహాధ్యాయులమై విద్యాభ్యాసము సేయఁ దొడంగితిమి. అచిరకాలములో విద్యారహస్యములన్ని యు గ్రహించి మా బుద్ధికౌశల్యమునకు మెచ్చుకొనుచు మా యుపాధ్యాయుండు నాకు విద్వత్కేసరి యనియు నొకనికి సోమభట్టారకుండనియు నొకనికి యజ్ఞదత్తుండనియు బిరుదముల నిచ్చెను.
అప్పుడు మాయౌవనమదము విద్యామదము మేనులు తెలియనిచ్చినవికావు. కన్నులున్నను గ్రుడ్డివారమైతిమి. ప్రపంచకమంతయు గోటిలో నున్నదని భావించుచుఁ బెద్దపండితుల నెదిరించుచు వితండవాదములు సేయుచు గర్వాభిభూతులమై తిరుఁగుచుంటిమి.
ఒకనాఁడు మేమిందు విహరించుచు యదృచ్ఛముగా సిద్దతీర్దంబునకుఁ బోయితిమి. అప్పుడు పౌరాణికుం డొకండు తీర్దప్రభావముఁజదివి జనులకిట్లు జెప్పుచుండెను.
గీ. సిద్ధతీర్ధంబు కాశిక్షేత్రమందు
జనులపాలింటి దేవభూజంబుసూవె
దేవులగొని భక్తినుతించి మ్రొక్కి
యేమిగోరిన దాని నీడేర్చునతఁడు.
జనుల కోరికలు సిద్ధింపఁ జేయుటంజేసె యీతీర్థంబునకు సిద్ధతీర్థం బనియు స్వామికి సిద్దేశ్వరుఁడనియు నన్వర్థనామములు గలిగినవి. అని తన్మాహాత్మ్యము నుడువుచుండ నందు నిలువంబడి మేము మువ్వురము వింటిమి. సోమభట్టారకుఁడు నవ్వుచు నిట్టిగాధలం జెప్పియే యిప్పురవాసులు తైర్దికుల మోసపుచ్చి ద్రవ్యము లాగుదురు. ఈ సిద్దేశ్వరుఁడే యింతమాత్రమునఁ గామ్యముల నొసంగినచో నిఁక జనులకు నేకృషితోను బనిలేదుగదా అని పరిహసించిన నేనిట్లంటి. మ్మితమా ! అట్ల నరాదు. తీర్దంబుల ప్రభావంబతి గుహ్యమై యుండును. అట్టి యుపాఖ్యానములు మనము పెక్కులు చదివి యుండలేదా? అనుటయు నవియు నసత్యములే యని యతండు వాదించెను. అవ్విషయమున యాయిరువురకుఁ బెద్దసంవాదము జరిగినది. యజ్ఞదత్తుఁడు నాతో నేకీభవించెను. అప్పుడు నేను నావాదము స్థిరపరచు తలంపుతో నా సిద్ధతీర్థంబున మునుంగి యా స్వామినివలఁ గొని యెదుర నిలువంబడి యిట్లుఁ గోరుకొంటి.
స్వామీ ! సిద్దేశ్వరుఁడా ! నాకు మిక్కిలి చక్కనిభార్య దొరకవలయును. అది నాకనుకూలయై వర్తింప నడవిలోనున్న స్వర్గములో నున్నట్లు సంతోషము గలుగవలయును. ఆ భార్యయందుఁ ద్రిలోక మోహజనకుండగు కొమరుం డొక్కరుఁడేమ గలుగ