Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(16)

వినత కథ

121

వినత :- పోయెదంగాని మొన్న పాడిన రాగ మొకసారి యాలాపించెదవా? విన వేడుక యగుచున్నది.

కృత :- నా కిప్పుడు తీరికలేదు. వ్రాసికొనవలయును బొమ్ము.

వినత :- నా యభిలాష తీర్చినందాక విడుచుదానను కాను.

కృత :- నీవు మగనాలపుగావా ? పరపురుషుల సాన్నిధ్యములు నేకాంతముగా నిలువవచ్చునా ?

వినత :- నీవు పరపురుషుఁడవని యిక్కడికి రాలేదు. మా యింటివారే యని వచ్చితిని.

కృత :- నివృత్తి మగం డెఱింగిన శిక్షింపఁడా ?

వినత :- మగనిశిక్ష యెట్ల యినను భరింపవచ్చునుగాని‌ మదీయ మనోభవ పరితాపము సైరింపకున్నానుగదా ?

కృత :- వినతా ! నీవు చిన్నదానవు. పెద్దవారియొద్ద మంచిగుణములు నేరిచికొనుము.

వినత :- అందులకేగాదా ? మీ యొద్దకు వచ్చితిని. ఆ గుణములేవియో గురువుడు శిష్యురాలనై మీ సేవఁ జేసెదను.

కృత :- మీ తండ్రి యెరింగిన దండించును జుమీ ?

వినత :- దండించెడివాఁడైనచో నిట్టి సుందరుని మందిరమున కేమిటికిఁ తీసుకొనిరావలయును.

కృత :- నా సుందరము నిన్నేమి చేసినది ?

వినత :- అమ్మక చెల్లా? ఏమి‌ చేసినది యని యడుగుచుంటివా ? నా హృదయమును లాగికొనిపోయి దాచికొన్నది‌.

అని మాట్లాడుకొనుచుండఁగాఁ దలుపులు తీయుఁడని వీధిలో మేఘనాధుఁడరచెను. ఆ మాటవిని వినత వోయి తలుపులు తీసినది. కూతుఁతలకు పట్టుచూచి యడలుచు నతం డమ్మా ! యిదియేమి పట్టి వైచితివి, శరీర మస్వస్థ‌తగ నున్నదా యని యడుగుటయుఁ దలనొప్పి మాత్రము వచ్చి నింపాదిగా నున్నదని చెప్పినది. అ చాపల్యమును గురించి కృతవర్మ మిక్కిలి విస్మయముఁ జెందుచుండెను నాఁడు సుత వినత సిగ్గువిడచి మాటిమాటికి నతండున్న గది ముంగలకుఁ బోవుచుండును. అందు నిలువంబడియే మాట్లాడుచుండును.. ఏదియో మిషంబన్ని యతనిం బల్కరింపఁబోవును. ఆ బింబోష్ఠి చేష్టలు తెలిసికొని మందలింపనేరక యొకనాఁడు మేఘనాధుండు మెల్లగా నిట్లనియె.

తల్లీ ! నీవు పెద్దదానవైతివి తరుచుగాఁ జావడిలోబడి రాఁగూడదు. ఎయతాతదు. సం నబనను లో కలు. ఛంకింతురు.. అం ఎప్పులయు నక్కల ని వచ్చు? 'చచ్చా? నొషల చఉలియమిగచా ? అయన సంగిరము