పుట:కాశీఖండము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82 శ్రీకాశీఖండము

జరత్తరుకోటకజఠరలుఠదజగరగళ గుహానిష్ఠ్యూతనిష్ఠురపవనసాధుక్షమాణదవదహనశిఖాకలాపంబును నుగ్రతరశరభచటులపేటపాతమోహితరోహితంబును సముద్ధతస్తబ్ధరోమకంఠకఠోరఘుర్ఘురధ్వానఘుమఘమాయమానదిక్కుంజరక్రోడంబును సుగ్రీడచ్చిక్రోడశిశుచరణనఖశిఖాశిఖరవిశీఢ్యమాణశిఖరశేఫాలికాకుసుమకేసరరజఃప్రసరధూసరవాకరకరవ్రాతంబును బరుషతరుపవనబిలపతితపచేళమదధిఫలభక్షణఫుల్లగల్లభల్లూకప్రకరంబును నగు మహాగహనమధ్యంబున. 148

సీ. యక్షరాజుఁ దలంచి యక్షిగోళంబుల
నశ్రుపూరము నించు నర్మి మిగిలి
పలుమాఱు నట దండపాణిసౌహార్దంబు
భావించి భావించి పలవరించు
సంభ్రమోద్భ్రముల విశ్వాపాత్రంబుల
సౌవిదల్లుల వర్థి సంస్మరించు
దిగ్గజాఘోరసిద్ధివినాయకకపర్ది
చింతామణీగణేశతులఁ బొగడు
తే. జ్యేష్ఠసౌభాగ్యసుందరీచిత్రకంఠ
వికటదుర్గామహాదేవి విశ్వవాహ
శాటికాదేవతల నిజస్వాంతవీథిఁ
గాంచిఁ గఱువ్రాల్పు సర్వాంగకములఁ దపసి. 149

క. త్రిణయనునిరాణివాసము
నణిమాద్యైశ్వర్యవితరణామరతరువున్