పుట:కాశీఖండము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 81

తే. ఏమి చెప్పఁగ నున్నది? యేవిధమునఁ
గాశి వెడలించుచున్నాఁడు కాలగళుఁడు
మనము లోఁగితి మేని లోఁగునె శివాజ్ఞ?
యుడుము నడికిన నడుకునే బడియ పెట్టు? 144

వ. అని వెండియు. 145

సీ. వక్షస్స్థలంబున వైచు మంత్రము చెప్పి
జమిలిపాములరాజుజన్నిదంబు
జడ లల్లి చొళ్ళియం బిడి యెక్కసకెముగా
బాలేందుశకలంబుఁ బదిలపఱచుఁ
గంఠమూలమునందుఁ గస్తూరిమాఱుగాఁ
గాలకూటవిషంబుఁ గీలుకొలుపుఁ
గటిభారమునయందుఁ గట్టు రింగులువాఱ
మెఱుఁగారు మువ్వన్నెమెకముతోలు
తే. గట్టువాలుపడంతి చక్కడముఁ దోఁపఁ
దఱచు గైసేయుచుండు నాతల్లి కాశి
యయిదుక్రోసులపొలములో నంత నంతఁ
జావు కుండంగఁ జచ్చినజంతువులకు. 146

చ. అని యెదురుండి మ్రొక్కి నయనాంబురుహంబుల బాష్పబిందువుల్
చినుకఁగ వెక్కివెక్కి కలశీసుతుఁడోయన నేడ్చు నీరెలుం
గున నొకకొంత కొంత మఱి గ్రుమ్మరు మిన్నున మ్రోవ నుద్ధుర
ధ్వని బఠియింపఁ జొచ్చెఁ బ్రణవంబునఁ గూర్చినమంత్రరాజమున్. 147

వ. అచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల వింధ్యాచలంబు డాయం జనుదెంచి విషమదృషత్ఖండవిలసనస్థలంబును