పుట:కాశీఖండము.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78 శ్రీకాశీఖండము

కాశికావిరహవేదనాభరంబు దుస్సహం బగుట నౌర్యశేయుండు కాశిని లక్ష్యంబు చేసి యి ట్లనియె. 134

క. ఆమచ్చిక యాయను వా
ప్రేమాతిశయంబు విస్తరింపఁగ వశమే?
భూమండలతిలకమ పర
భూమికి ని న్నెట్లు వాసి బోవుదుఁ గాశీ! 135

మ. నిజ మేఁ బల్కెద బాహులెత్తి శ్రుతివాణీజాహ్నవీగోపతి
ధ్వజడుంఠీశగణేశ్వరుల్ గుఱిగ నోవారాణసీదేవి! యో
గజచర్మాంబరుకూర్మిపట్టణమ! యోకల్యాణి! నిన్ బోలనం
బుజగర్భాండమునందు లేవు నగరంబుల్ తీర్థరాజంబులున్. 136

తే. లేవు లింగంబు లవిముక్తలింగమునకు
సాటిసేయంగ భూర్భువస్స్వస్త్రయమున
రావు దక్కటిపుణ్యతీర్థములు నీకు
సాటిసేయంగ భూర్భువస్స్వస్త్రయమున. 137

వ. అని యెట్టకేలకుం గదలి విరాళింగొన్నచందంబున మరులు గుడిచినపోల్కి నపస్మారం బెత్తినపగిది నన్నుకొన్నవిధంబున దూపటిల్లినతెఱంగునఁ దూలపోయినరీతి విషం బెక్కినలీల మ్రాఁగన్ను పెట్టినలాగున లాహిరి పట్టినభాతి మదంబెక్కినమాడ్కి నుంగిడిగొన్నభంగి నూసరిల్లుచు నుస్సురనుచు నుమ్మలించుచు నుదిలగొనుచు నుపతాపం బందుచు నూటాడుచు నూర్వశీనందనుం డూర్ధ్వబాహుండై యుచ్చైస్స్వనంబున. 138

సీ. పరమకల్యాణీ! యోభాగీరథీ! గంగ!
వార్ధిభామిని! పోయివత్తు నమ్మ!