పుట:కాశీఖండము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54 శ్రీకాశీఖండము

హితాతాత్పర్యపర్యాలోచనఁ బచేళిమం బైనవివేకంబున మత్స్యమాంసం బభ్యర్హితులు గర్హింతు రని యెఱింగి కాఁబోలుఁ బంకజోత్పలకుముదకల్హారసంకులంబులగు కొలంకులఁ బెద్దమీను కొండుకమీనుం దాఁకదు. దరవికచవకుళకురవకన్యాకేసరపరాగధూసరంబు లగుమధుమాసవాసరంబులందును బంచబాణుం డించువి ల్లెక్కువెట్టఁ జెఱుచుం గావునఁ గొంచి కొంచి యప్పశుపక్షిమృగమిథునంబులు నిధువనక్రీడ లాచరించు. కంఠగతప్రాణు లగుజంతువులకుం గాలకంఠుండు గరుణావశంవదుండై కర్ణోపకంఠంబుఁ జేరి తారకబ్రహ్మమంత్రరాజంబు నుపదేశింప మంతనంబున విని యెఱుంగుటం జేసి మధుమదోల్లాసంబున నది వెల్లివిరి(సే)యుచున్నయదియో యన నిందిందిరంబులు మంద్రస్వనంబున ఝంకారంబు సేయ నక్తభోజనవ్రతస్థులతోడి సంసర్గంబుననో చకోరవర్గంబు నక్తంబులం జంద్రచంద్రికాకరంభంబునఁ గౌక్షింభర్యంబు సంభావించు నట్టిపుణ్యాశ్రమంబు దరిసి చనునప్పుడు మునులు బృందారకులు నిజాంతర్గతంబున. 44

తే. ఎన్నఁడును నేగి లేనట్టి యిమ్మహాశ్మ
శానమున (యందుఁ) గాఁపురంబున్నజంతువులకు
నేటి నాకంబు? పున్నియం బెడలినప్పు
డొఱకమునఁ గూలవలయుఁ గీ లూడినట్లు. 45

తే. అపునరావృత్తిశంభులోకాధివాస
సౌఖ్య మొనగూడు నిచ్చోటిజంతువులకుఁ