పుట:కాశీఖండము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 53

గ్రుమ్మరి యచ్చోటి పెద్దలవలన గందువ యెఱింగి చని తత్పుణ్యాశ్రమంబుఁ బ్రవేశించి రందు. 42

సీ. కండూయనము సేయుఁ గరటి శుండాదండ
పుష్కరమ్మున సింహపోతకంబు
వాలారునఖముల వదన మించుక యెత్తి
ముద్దాడుఁ బులి లేటిముద్దరాలి
నిండుకౌఁగిటఁ జేర్చి నెమ్మిమైఁ దోఁడేలు
గోదమచింబోతును గుస్తరించుఁ
గుంజమంటపకుటీక్రోడమధ్యంబున
నాఖుతోఁ జెఱలాడు నడవిపిల్లి
తే. యెండ దాఁకక యుండంగ నెత్తి పట్టుఁ
బగలు ముంగికి భుజగంబు పడగగొడుగు
కోఁతితో మైత్రి వాటించుఁ గొండగొఱియ
యౌర్వశేయుని పుణ్యాశ్రమాంతరమున. 43

వ. వెండియు నవ్వనంబున నీవారోచనమండం బుష్ణమధురంబు(గ) గండూషించి క్రొత్తపురిటాలికిం గురంగికి మెత్తమెత్తన కురంగంబు గ్రోల్చు ప్రసక్పత్సర్పీరభిఘార(ప్రవాహ)ధారాగంధపాణింధమంబై కర్కంధూపలో న్మిశ్రశాకపాకంబుల తాలింపులకమ్మనికంపు పాంథఘ్రాణంబుల కింపుసొంపు సంపాదించు, సరసీతీరంబున సారసంబు సారస్యంబు పక్ష్మలింప లక్ష్మణాకంఠోపకంఠంబునం గంఠంబుఁ జేర్చి సుఖపారవశ్యంబునం జొక్కెనో? ముక్కంటి లోఁగంటం గనుంగొనుచు నిశ్చలధ్యానయోగానుసంధానంబున మాధుర్యంబు భజించెనో? యెఱుఁగరాకుండ నుండు. శ్రుతిస్మృతిపురాణేతిహాససం