పుట:కాశీఖండము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50 శ్రీకాశీఖండము

బునఁ దీర్థంబాడి తీర్థోపవాసులకు వాసోహిరణ్యగంధసారకర్పూకస్తూరికాకుంకుమంబులను ఖండశర్కరాపూపసూపాజ్యదధిపయఃఫలాదితర్పణద్రవ్యంబులను సుపానత్పాదుకాచ్ఛత్రంబులను గుండికాదండరల్లకవ్యజనచామరంబులఁ గౌపీనశాటికాకరండంబులను దైలలవణేంధనంబులను గుగ్గులుమహిసాక్షిప్రముఖధూపద్రవ్యంబులను వెండియుం గ్రియాకాండంబులనుం బరితోషంబు సంపాదించి విశుద్ధహృదయులుఁ బ్రసన్నాత్ములు నై శ్రుతస్మృతిపురాణేతిహాసప్రతిపాదిత వేదానువచనయజ్ఞదానతపోవ్రతాదులచేతం బ్రక్షీణసకలకల్మషులు భసోద్ధూళితాంగులు రుద్రాక్షమాలికాలంకృతాంగులునై శంకరుం గురంగాంకశేఖరు నిరస్తసమస్తోపాధికస్వప్రతిష్ఠాఖండసంచితానందైకరసాద్వితీయస్వరూప విరూపాక్షు విశాలాక్షీహృదయాధీశ్వరు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు సందర్శించి ప్రణమిల్లి జగన్నిర్మాణనియమపరిపాలనాదిశక్తియుక్తుం డగునద్దేవుం బంచబ్రహ్మపంచాక్షరప్రణవమంత్రంబుల నావాహనస్థాపన సాన్నిధ్య సన్నిరోధనసంకలీకరణాదులగు దశవిధసంస్క్రియాకలాపంబుల నుపచరించి వెండియు. 36

క. ఆడిరి ప్రమోదనృత్తము
పాడిరి మంద్రకమహాప్రబంధంబుల మో
మోడిరి తైర్థికులకుఁ గొ
ల్లాడిరి కైవల్యలక్ష్మి నమరులు మునులున్. 37

సీ. అందంద చేసిరి యభవుగేహమునకు
ధన్యాత్తు లలర ప్రదక్షిణములు