పుట:కాశీఖండము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 49

వ. హర్షోత్కర్షంబునం దమలోన. 33

సీ. మనభాగ్యమునఁ గాదె కనకాచలేంద్రంబు
విశ్వాధికౌన్నత్యవిభవ మొందె
మనభాగ్యమునఁ గాదె మార్తాండమండలి
వినువీధి రోధించె వింధ్యశిఖరి
మనభాగ్యమునఁ గాదె మర్త్యపాతాళత్రి
విష్ణపంబులకు నరిష్ట మొదవె
మనభాగ్యమునఁ గాదె కనకగర్భుండు ప్ర
త్యక్ష మై యుపదేశ మానతిచ్చె
తే. నహహ! మనభాగ్యమునఁ గాదె యమరతటిని
దరి వసించినవాఁడు వాతాపిదమనుఁ
డిన్నిసౌభాగ్యములు(ను) గూడియిచ్చె మనకుఁ
గాశికాక్షేత్రరాజవీక్షాసుఖంబు. 34

క. ఏకక్రియ ఫలయుగ్మము
నాకర్షింపంగఁ జాలు నది లోపాము
ద్రాకాంతుఁ గుఱిచి పోవఁగ
శ్రీకాశీదర్శనంబుచే సిద్ధించున్. 35

దేవర్షులు బ్రహ్మనియోగంబున నవిముక్తంబున కేతెంచి యగస్త్యుని దర్శించుట

వ. జనుచు బ్రహ్మలోకంబుననుండి డిగ్గి వారు వారణాసీపురోపకంఠంబున శ్రీకంఠజటాటవీకుటజకోరకంబును బరమేష్ఠికమండలుతీర్థసలీలధారాధోరణియును గుపితకపిలమునిపరివృఢకపిలదృగనలచుళికితవపురఖిలసగరసుత స్వర్గారోహణసోపానమార్గంబును నగు భాగీరథియందు మణికర్ణికాకుండం