పుట:కాశీఖండము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 47

బెడగాఁరు నెచ్చోటఁ గడను యింతయు లేమి
సామగ్రి శుభవస్తుసంచయంబు
తే. నట్టిగోలోకమునయందు నధివసింతు
రభవుచేఁ నెల్ల ప్రొద్దు నెయ్యంబుఁ గనుచు
నలఘుమూర్తులు గోమాతృకలు సుశీల
యాడిగాఁ గలపరమకల్యాణనిధులు. 48

వ. అట్లు గావున గోవులకు మిగిలినయుపాసనీయంబు లేదు. గోప్రదాతలకు మిగిలిన పుణ్యవంతులు లేరు. వెండియు నాకర్ణింపుఁడు. సరస్వతీతీర్థమృతులును, మార్తాండుండు మకరస్థుండై యుండఁ బ్రయాగతీర్థంబున మాఘస్నానంబు చేసినకృతార్థులును, వారణాసియందు బంచనదంబునం గార్తికమాసమందుఁ దీర్థమాడినవిశుద్ధదేహులును, గురుక్షేత్రంబునం గణికామాత్రంబై ను హిరణ్యంబు దానంబిచ్చిన దాతలు మొదలుగాఁగల నానాధర్మపరు లస్మదీయలోకంబున వీరె నిజకర్మోచితపదంబులం గల్పస్థాయిసుఖంబు లనుభవించుచున్నవారు మీకును నింక భయంబువలదు మీరు వచ్చినకార్యం బే నెఱుంగుదు వింధ్యం బవంధ్యగర్వోదయంబున గీర్వాణభూధనంబుతో మచ్చరించి శృంగోచ్ఛ్రాయంబులఁ బతంగమార్గంబు నిరోధించి బుధజనంబులకు బాధసేయుచున్నయది. ఈయకాండప్రళయంబులకు బెగ్గలంబంది యాపత్పరిహారార్థంబు నన్ను శరణు జొచ్చితిరి. అరిష్టనిరసంబునకు నుపాయంబు చెప్పేద. మహామునియగస్త్యుం డవిముక్తంబనుపముక్తిక్షేత్రంబున విశ్వేశ్వరు విరూపాక్షు భోగమోక్షప్రదాయకుం దారకబ్రహ్మోపదేశార్థంబు సేవిం