పుట:కాశీఖండము.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

472

శ్రీకాశీఖండము


థుని కృపపేర్మి నెంద ఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బనిగొనునట్లు పెట్టుదు నపారము లైనయభీప్సితాన్నముల్.

183


వ.

అనిన నట్లకాక మహాప్రసాదం బని వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికిం జని యుపస్చర్శం బాచరించి యేతెంచిన.

184


తే.

గొడుగు పాగలు గిలుకలు గులుకరింప
నిందుబింబాస్య యెదురుగా నేగుదెంచి
ఛాత్రసహితంబుగాఁ బరాశరతనూజు
బంతి సాఁగించె ముక్తిశాలాంతరమున.

185


వ.

అనంతరం బావిశాలాక్షీ మహాదేవి యనుభావంబున నమ్మహామునులముందటం గనకరంభాపలాశపాత్రంబులయందు విచిత్రంబుగాఁ గలవంటకంబులు, నపూపంబులు, లడ్డుకంబులు, నిడ్డేనలు, గుడుములు, నప్పడంబులు, నిప్పట్లు, గొల్లెడలు, దోసియలు, సేవియలు, [1]నంగరపొలియలు, పోవెలు, [2]సారసత్తలు, [3]బొత్తరలు, జక్కిలంబులు, మణుఁగుఁబూవులు, మోరుండలుఁ, బుండ్రేక్షుఖండంబులు, బిండఖర్జూరద్రాక్షానారికేళకదళీపనసజంబూచూతలికుచదాడిమీకపిత్తకర్కంధూఫలంబులు, గసగసలుఁ, బెసరుపులగములుఁ, జెఱకుగుడుములు, నరిసెలుఁ, బిసకిసలయములవరుగులుఁ, జిఱుగడములుఁ, బడిదెములుఁ, బులుపలుఁ, బులివరుగులు, నప్పడంబులు , బప్పు(లు), రొట్టియలును, జాపట్లు, బాయసంబులుఁ, గర్కరీకారవేల్లకూశ్మాండ నిష్పావకపటోలికాకోశాతక్యలాబూ

  1. 'అంగరొల్లె' లని శబ్దరత్నాకరము.
  2. 'సారసత్తులు' అని శ. ర.
  3. బొంతరకుడుములు