పుట:కాశీఖండము.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

450

శ్రీకాశీఖండము


దామెనలు గూర్చి నడిపించెఁ దరతరంబ
వీరభద్రుండు పశువుల వెల్చునట్లు.

89


మ.

పనిలే దేటికి బాధ పెట్ట నను? నబ్రహ్మణ్య మైతో? మొఱో
యని యుచ్ఛైర్ధ్వనిఁ గూఁతవెట్ట ముఖశాలాంతంబునన్ గ్రాద్ధదే
వునిఁ గట్టించెను వీరభద్రుడు భటవ్యూహంబుచే నాగ్రహం
బున ధూమోర్ణపయోధరద్వితయమున ముద్దాడు హస్తాబ్జముల్.

90


క.

[1]రాసించె భృగుని పండ్లను
గూపెట్టఁగఁ గాలకంఠుకొడు కుత్తరవే
దీపాషాణాంచలమునఁ
బాపపుయాగమునఁ దొట్రుపడి రంత మునుల్.

91


చ.

మతకరిపాకశాసనుఁడు మత్తాశిఖావళశాబకంబునా
కృతి ధరియించి ప్రాంతమునఁ గేలిమహీధరశృంగ మెక్కి ని
ర్వృతమతి నుండె వేలుపులు వేదనఁ బెట్టెడువీరభద్రు ను
ద్దతి పరికించుచున్ [2]నయపథంబు బృహస్పతి చే టెఱుంగఁడే!

92


తే.

తఱిగె నర్యము దీర్ఘదోర్దండయుగము
క్రకచమున వీరభద్రుఁడు కరుణ దొఱఁగి
త్ర్యంబకునిపట్టి పవను వధ్యంబు సేసె
వానియంతఃపురస్త్రీలు వసటఁ బొంద.

93


చ.

వలపలికాల ముక్కునను వాత సుధారస ముప్పతిల్లఁ గా
వెలికిల వైచి మట్టె రణవీరశిఖామణి వీరభద్రుఁ డ

  1. క. ‘రావించె భృగుని’ పాఠాంతరము.
  2. ‘నయపంథంపు బృహస్పతి చొప్పెఱుంగఁడే.’ ఒక వ్రా.ప్ర.
    ‘చేదెఱుంగఁడే’ పూ. ము. ప్ర