పుట:కాశీఖండము.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

448

శ్రీకాశీఖండము


యానతిచ్చిన మహాప్రసాదంబని విరూపాక్షుం బ్రదక్షిణంబు వచ్చి దక్షిణాభిముఖుండై ధాటీసంరంభంబున నరిగెనప్పుడు.

81


క.

సంగడిఁ బిఱుంద ముందట
నింగియు నేలయుసు నిండె నిష్ఠురభంగిం
బుంగవకేతను సుభటుల
భంగురవీరప్రతాపభయదస్ఫురణన్.

82


క.

కొండలు మహీరుహంబులు
గండోపలములు ధరించి కహకహ నగుచున్
మెండుకొని యజ్ఞవాటిక
[1]కొండొరు గడవంగ బారి రుద్భటభంగిన్.

83


వ.

అందుఁ గొందఱు యూపస్తంభంబు లుద్ఘాటించిరి. కొందఱు కుండంబులను బూడిచిరి. కొందఱు మంటపంబులు పడఁద్రోచిరి. కొందఱు వేదికలు క్రొచ్చిరి. కొందఱు హవిస్సులు భక్షించిరి. కొంద ఱన్నంబు లారగించిరి. కొందఱు పాయసంబులు మెసఁగిరి. కొందఱు పిండివంటకంబులు మ్రింగిరి. కొందఱు ఘృతదధిక్షీరక్షౌద్రపుండ్రేక్షుఫలాదు లాస్వాదించిరి. కొందఱు యజ్ఞపాత్రంబులు పగులమొత్తిరి. కొందఱు స్రుక్స్రువంబులు విఱిచిరి. కొందఱు శకటంబులు విటతాటనంబులు సేసిరి. కొందఱు చషాలంబులు చెవులం దగిలించుకొనిరి. ఇవ్విధంబున నిర్మర్యాదంభై నిరవగ్రహంబై పారిషదుల యాగ్రహంబులు చెల్లుచుండం గోపాటోపసమున్నిద్రుండై.

84
  1. ‘కొండొరుఁ గడవంగఁ జొచ్చి రుగ్రత మెఱయన్’ అని వ్రాతపుస్తకము.