పుట:కాశీఖండము.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

434

శ్రీకాశీఖండము


క.

జడముడులు సడల భ్రుకుటులు
ముడివడఁ గనుఁగడలఁ గెంపు మొలతేరంగా
మృడుప్రమథులు పులితోలుం
గడవసములు వి(ను)డిచికొనుచుఁ గడురభసములన్.

33


ఉ.

చంపుదుమే కృతాంతు? శిఖిచండమయూఖుల బారిగొందుమే?
డంపుదుమే కుభృత్పరివృఢంబుల? మొత్తుదుమే యజాండములన్?
జింపుదుమే చతుర్దిశలు జృంభితబాహుపరాక్రమక్రియా
సంపద సొంపు మీఱఁ? [1]బురసంహరునానతి యింత గల్గినన్.

34


వ.

అని వెండియు.

35


తే.

మాటిమాటికిఁ గోపసంభ్రమముపేర్మిఁ
గక్షపాత్రంబులం దున్నకర్మభూతి
వదనములఁ బ్రామికొనుచు నిర్వక్రలీల
'హరహరా!' యని పల్కి రత్యాగ్రహమున.

36


వ.

అప్పుడు దుర్వాసుండు శర్వాణీపతికి దండప్రణామంబు లాచరించి తలవకారముండక ఛాందోగ్యశ్వేతాశ్వతరాద్యుపనిషదర్థగర్భితంబు లైనబహువిధస్తోత్రసందర్భంబుల నమ్మహాదేవుం బ్రస్తుతించె. శివుండునుం బ్రసన్నుండయి యమ్మునీంద్రునకుం గోరినవరంబు లొసంగి యంతర్హితుం డయ్యె. ననంతరంబ.

37


తే.

అమ్మునీంద్రుండు దనపేర నధికభక్తిఁ
గాశియందుఁ బ్రతిష్ఠించెఁ గాలకంఠు

  1. ‘పురశాసన! మాకు ననుజ్ఞ గల్గినన్.’ అని తాళపత్రపుస్తకపాఠము.