పుట:కాశీఖండము.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422

శ్రీకాశీఖండము


శా.

ప్రాతఃకాలమునందు మర్త్యుఁడు [1]హరత్పాపాభిధానహ్రద
స్రోతఃపూరమునన్ మునింగి పరమజ్యోతిర్మయంబు న్ముని
ధ్యాతవ్యంబును శాశ్వతంబు నగు కేదారేశలింగంబు సం
ప్రీతిం జేరి భజించి కాంచు వితతాభీష్టార్థసంసిద్ధులన్.

302


వ.

తొల్లి రథంతరకల్పంబునందు వశిష్ఠుం డను విప్రుండు హిరణ్యగర్భాచార్యువలనం బాశుపతదీక్ష వడసి కేదారేశ్వరుని సేవించి ముక్తుం డయ్యె. వెండియు.

303


సీ.

శిశిరభూధరకన్య చిఱుబంతిపసు పాడు
        నెందు సాయంకాల మిం పొనర్చు
నరుఁ డెందు జలము నుద్ధరణంబు సేవించి
        శంభులింగముఁ దాల్చు జఠరపిఠరి
వినువీథిఁ బోరాడి వివశంబు లై కూలి
        హంసంబు లయ్యె వాయసము లెందుఁ
బ్రవహించు నెందు శ్రీభాగీరథికిఁ బోటి
        యమృతప్రదాహ్వయ యైనతటిని


తే.

యది విముక్తివధూకంఠహారతిలక
దివ్యకేదారలింగేశతీర్థభూమి
సదనదీవాపిపల్వలహ్రదసమగ్ర
ద్రాక్షపందిరి కాశికోద్యానమునకు.

304


వ.

అందు గౌరీకుండంబు గౌరతీర్థం బమృతప్రవాహతీర్థంబు మానసతీర్థంబు గలహంసతీర్ణంబు మొదలుగా ననేకతీర్థం

  1. ‘హరున్ బాపాభిధాన’ యని యచ్చుపుస్తకము. ‘హరం పాపాభిధాన’ యని యొక వ్రాఁతపుస్తకము, ‘హర పాపహ్రదేస్నాత్వా’ యని సంస్కృతమూలము. ఛందోభంగనివృత్తికై ‘హరత్పాప’ యని సవరింపఁబడినది.