పుట:కాశీఖండము.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

412

శ్రీకాశీఖండము


నొలికిన వాని మేయుటకు నోలిఁ బ్రదత్మక్షిణ మాచరించి చి
ట్టెలుక శరీరముం [1]దొరుగ కెక్కెనుబో రజతాద్రికూటమున్.

257


క.

ఘటసంభవ! శ్రీకాశీ
కటకమునకు నికట గగనగంగాతటి నీ
చటులకృపీటోర్మిఘటా
స్ఫుటదఘమున కెనయె యితరపుట భేదనముల్?

258


శా.

అంభోజాసను నంతవానికిని శక్యంబే నుతింపంగ నో
కుంభీసంభవ! డుంఠిరాజకరటక్రోడక్షరద్దానవా
స్సంభేదప్రవిజృంభమాణ వరణాసంపర్కసంపన్న కౌ
క్షింభర్యామరసింధునైకటికమున్ శ్రీకాశికాక్షేత్రమున్?

259


క.

అవిముక్తం బవిముక్తం
బవిము క్తం బగుచుఁ బ్రాతరారంభములం
దవధానపరత నెవ్వం
డు వచించును వాఁడు ధన్యుఁడు మునిప్రవరా!

260


తే.

మొగుచు జంతువు కాశికానగరసీమ
న పునరున్మీలనమునకై యక్షియుగముఁ
గాంచు నిక్కలగా నొక్కకలయు నపుడు
త్రిణయనుఁడు గాఁగఁ దన్ను నాదీర్ఘనిద్ర.

261


ఉ.

ఎట్టు నుతింతు నల్పమతి నిల్వలమర్దన! యేను గాశికా
పట్టణశంభుమూర్తులఁ గృపాగుణ! యోర్తులతాంగి ఱేపెదు
ర్కట్టున ముంగిటం గసవుగాండ్రయుఁ బుచ్చుచుఁ జేతిచీపురుం
గట్టయుఁ దానుఁ జొచ్చెఁ గఱకంఠుని నోంకృతినాథదేవునిన్.

262
  1. 'దొఱఁగి యెక్కె రహిన్' అని పాఠాంతరము మూలవిరుద్ధము.