పుట:కాశీఖండము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28 శ్రీ కాశీఖండము

మతివై యవధరింపుము. నీకు సేవాంజలీపుటంబు పంచాశత్కోటివిస్తీర్ణం బైనభూమండలఁబునందు నీవు చూడనియట్టి మహీధనంబులు లేవ. కొండలు లెక్కకుఁ బెక్కు కలుగుంగాక, యెనిమిది దిక్కుంజరంబులకు దిక్కై కూర్మంబునకు నర్మిలియై క్రీడాక్రోడంబునకుఁ దోడై పాఁపఱేనికిం బ్రాపై యేసుబోలె నెక్కటి యీసర్వసర్వంసహాచక్రంబును భరియింపంగలయదియే? మందరంబు మందరశి, నీలంబు నీలనిలయం, బస్తం బస్తవ్యస్తం, బుదయం బనభ్యుదయంబు, క్రౌంచం బకించనంబు, గంధమాదనంబు పేద, పారియాత్రం బేతన్మాత్రంబు, మలయదర్దురత్రికూటంబు లొకపాటివి, మహేంద్రనిషధద్రోణంబులు దరిద్రాణంబులు, హేమకూటంబు గిటగిటన, తక్కుఁజిఱుకొండలఁ బేర్కొనం గారణం బేమి? ఇప్పు డిప్పాట నాతోడం బ్రతిభటింపఁ గలయది సురగరుడఖచరవిద్యాధరయక్షకిన్నరగంధర్వదర్వీకరాశ్రయంబును, గల్పతరువాటికామధుగ్ధేన్దుమండలంబును, విబుధవేదండశుండాదండచుళికితోద్క్షగీర్ణస్వర్ణదీకాండగండూషితబ్రహ్మాండగోళంబును నగు సుమేరుశైలంబు, మాయిద్దఱతారతమ్యంబును నెఱుంగుదు. నాకు నగ్గిరికి నిప్పుడు గొన్ని వాసరంబులనుండి యీరసంబు పెరుఁగం గఱకఱిక నెట్టుకొని సాగుచున్నది. ఇంక నెట్లుండు? భట్టారకా! మొకమోట యుడిగి పక్షపాతంబు పరిత్యజించి యానతిమ్ము.

తే. అని యవష్టంభసంరంభ మతిశయిల్లఁ
బలుకుటయు నాత్మ గర్హించి నలువపట్టి
యొం డనాక యొక్కింతసే పూరకుండి