పుట:కాశీఖండము.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

397


పయోవేణి నిర్ధూతపాదారవింద
ద్వయీరత్నపీఠాంకఁ దాళప్రమాణన్
భయఘ్న న్మహారుండ భావింతు రార్యుల్.

211


వ.

మహారుండకుం బశ్చిమభాగంబున స్వప్నేశ్వరి. ఆస్వప్నేశ్వరి భజించువారలకు భూతభవిష్య[1]చ్ఛుభాశుభార్థంబులు గలలోనం దెలుపుచు నవమ్యష్టమీచతుర్దశీదివసంబులం బూజఁగొను. ఆస్వప్నేశ్వరికి వరుణదిగ్భాగంబున దుర్గాదేవి. ఆ దుర్గ కాశీక్షేత్రంబున దక్షిణద్వారదేశంబు రక్షించుచుండు ననినం గుంభసంభవుండు శంభుసంభవున కి ట్లనియె.

212


గీ.

తుహినగిరి రాజకన్యక దుర్గ యయిన
కారణం బేమి? కందర్పవైరితనయ!
ఆనతిమ్మన్న గుహూఁడు వింధ్యాద్రిదమన!
విను మనుచుఁ జెప్పఁ దొడఁగె సవిస్తరముగ.

213


దుర్గామాహాత్మ్యము

వ.

దుర్గుం డనుపేర నొక్కరాక్షసుండు రురునికొడుకు తపోబలంబున నవధ్యుఁ డై భూర్భువస్స్వర్భువనంబులు బాధింపం దొడంగిన దేవతలు మహేశ్వరు నభయంబు వేడిన నట్లగా నొసంగి శివుండును రాక్షసునిం భంజింప దాక్షాయణి నియోగించిన.

214


గీ.

గౌరి వింధ్యాద్రి కేతెంచి కాళరాత్రి
బంచె రాత్రించరేంద్రునిఁ బట్టి తేరఁ
జంపఁ బాతాళమున కంపఁ జాలునట్టి
శక్తియును నేర్పు నిచ్చి యైశ్వర్య మెసఁగ.

215
  1. ద్వర్తమానశుభాశుభంబులు