పుట:కాశీఖండము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 27

వానిగౌరవ మది గౌరవంబు గాని
కాదు గౌరవ మాకారగౌరవంబు. 98

సీ. మొగులు ముట్టినమహామూర్ధంబు ధర మోవఁ
బాదాంబుజములకుఁ బ్రణతిఁ జేసి
యంతరంగముకంటె నత్యున్నతం బైన
పృథుహేమసీఠంబు వెట్టఁ బంచి
దధ్యాజ్యమధుపుష్పదర్భాదికము లైన
యష్టాంగములతోడి యర్ఘ్య మిచ్చి
యాత్రాసముత్థితాయాసఖేదము వాయ
నంఘ్రిసంవాహనం బాచరించి
తే. శ్రాంతి దీఱుట యెఱిఁగి హస్తములు మోడ్చి
వినయవినమితగాత్రుఁడై విన్న వించె
తనగుహారంధ్రములు ప్రతిధ్వనుల నీన
వేల్పుఁదపసికి నిట్లని వింధ్యశిఖరి. 99

వ. మహానుభావా! భవదీయకృపాకటాక్షవీక్షాసుధారసప్రవాహంబున రజఃప్రసరంబును ద్వదంఘ్రినఖచంద్రమండలజ్యోత్స్నాసమున్మేషణంబునం దమఃకాండంబును ఖండింపఁబడియె. ఇంతగాలంబునకుఁ బ్రాగ్జన్మకృతంబు లైనసుకృతంబులు ఫలించె. విశ్వంభరాభారభరణదీక్షాధురంధరంబు లగునాకులంబు వసుంధరాధరంబులలోన మాన్యుండ నైతి ధన్యుండ; గృతార్థుండ, భాగ్యవంతుండ; అది య ట్లుండె. యుష్మత్పాదారవిందసందర్శనంబునం బ్రభవించినయానందప్రవాహం బుల్లంబున వెల్లివిరిసినకతంబున నేయర్థంబునకు నవకాశంబు లేదు. ఐనను నొక్క విన్నపంబు సావధాన