పుట:కాశీఖండము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26 శ్రీకాశీఖండము

నుం గూడి కిటిశరభగండవేదండశార్దూలసింహగవయసృమరచమరవాతప్రమీలులాయఖడ్గరురుకురంగభల్లూక ఫేరవగోలాంగూలాది నానామృగంబుల యెలుంగులతోడఁ గీడ్పెఱసి లతాకుడుంగగర్భంబులం బ్రతిశబ్దంబు లావిర్భవింపంజేయఁ గిసలయముకుళకుసుమశలాటుఫలభరితంబై బిసరుహబాంధవునికి కిరణవిసరంబులను సొంగనీయకమసుమసుకనియిరు లసలుకొనుచు నిసుక చల్లిన రాలని పసరుఢాలవింధ్యవసుంధరాధరప్రాంతకాంతారంబు దఱిసి చనువాఁడు ముందట. 93

మ. నలినప్రోద్భవసూతి గన్గొనియై వింధ్యక్షోణిభృత్కందరా
బలవద్గండశిలాఘాతవిలుఠత్పాథస్తరంగచ్ఛటా
స్ఖలసంరంభవిజృంభమాణపటుఝంకారస్ఫుటాంతర్మదన్
గలనాతత్పరభక్తలోకపరిరక్షాశర్మదన్ నర్మదన్. 94

తే. దివిజముని నర్మదానదిఁ దీర్థ మాడి
విమలభస్తంబు నిఖలాంగకముల నలఁది
యఱుత రుద్రాక్షమాలిక లనువుపఱచి
భవుని నోంకారనాథునిఁ భక్తి గొలిచి. 95

వ. అప్పుడు. 96

తే. స్థావరం బైనరూపంబు జలదవీథి
నావరించుచు మొదల నున్నట్ల యుండ
జంగమంబైనరూపంబు నవధరించి
యెదురుగా వచ్చె వింధ్యమహీధరంబు. 97

తే. అతిథి గడునల్పుఁ డైన నత్యధికుఁ డైన
నింటి కేతేరఁ బ్రియ మందు నెవ్వఁ డేని