పుట:కాశీఖండము.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

377


గీ.

శంఖపద్మగదాచక్రసహితుఁడైన
యట్టినన్నుఁ ద్రివిక్రముఁ డండ్రు బుధులు
శంఖమును నంబుజంబును జక్రగదలు
దాల్చుననుఁ జెప్పు జగము శ్రీధరునిఁ గాగ.

137


వ.

శంఖచక్రగదాపద్మంబుల హృషీకేశుండును, శంఖచక్రపద్మగదల నృసింహుండును, శంఖగదాపద్మరథాంగంబుల నచ్యుతుండును, శంఖారిగదాపద్మంబుల వాసుదేవుండును, శంఖపద్మగదాచక్రంబుల నారాయణుండును, శంఖపద్మచక్రగదలం బద్మనాభుండును, శంఖగదారికమలంబుల నుపేంద్రుండును, శంఖచక్రపద్మగదల హరియును, శంఖపద్మగదాచక్రంబులఁ గృష్ణుండును బ్రకాశింతురు. ఇవి మదీయదివ్యమూర్తిభేదంబు లని యానతిచ్చి కార్యాంతరవ్యాసంగంబున మాధవదేవుం డంతర్ధానంబు సేసె. అగ్నిబిందుండును జరితార్థుఁడై [1]బిందుమాధవదేవునియందు నేకీభవించె. ఇది బిందుమాధవాగ్నిబిందుసంవాదం బనునితిహాసంబు. దీని వినినను బఠించినను వ్రాసినను మానవులకు భోగమోక్షములు సిద్ధించు ననినం గుమారున కభివాదనంబు సేసి కుంభసంభవుండు వెండియు ని ట్లనియె.

138


వృషభధ్వజావిర్భావము

సీ.

పార్వతీనందన! పాంచజన్యధరుండు
విఘ్నరాజును శ్రీయు వేఱు వేఱ
వివిధమాయోపాయవేషభాషాదుల
భ్రమియించి కాశికాపట్టణమున

  1. బిందుమాధవసేవాతాత్పర్యంబున