పుట:కాశీఖండము.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

339


దంబు మసలె, వివస్వంతుండు వెనుక మఱచె, నంభోజసంభవుండుసు గదలనికంబం బయ్యె, నిఁకం బరమవిశ్వాసనిధు లగుప్రమధులం బంచెదంగాక!’ యని బహుమానపురస్సరంబుగా నొక్కతోయంబున శంకుకర్ణమహాకర్ణులను, నొక్కవగ ఘంటాకర్ణమహాకాళులను, నొక్కకెడ సోమనందినందిషేణకాళపింగళకుక్కుటులను, నొక్కవర్గంబునఁ గుండోదరమయూరబాణగోకర్ణులను, నొక్కమొత్తంబునం దిలకర్ణసూలకర్ణద్రుమ చండప్రభామయసుకేశచ్ఛాగ కపర్థిపింగలాక్ష వీరభద్రకిరాత చతుర్ముఖ నికుంభ పంచాక్షభారభూతత్ర్యక్షక్షేమకవిరాధసుముఖాదిపాషండులనుం బంచిన.

35


తే.

భర్తపని పూని నిజముగాఁ బ్రతిన వట్టి
పోదు రానందకాననంబువకుఁ బోయి
[1]మోహమాహాత్మ్య మెట్టిదో మునివరేణ్య?
ప్రమథు లప్పుడ మఱతురు భవునియాజ్ఞ.

36


శా.

సేమం బొప్పఁగఁ గాళికానగరికి న్విశ్వేశ్వరాజ్ఞామహా
సామర్థ్యంబు జటాకిరీటములపై సంధించి ము న్పోయి త
త్సీమాంతంబున నంతయు న్మఱచి యాసిద్ధుల్ శివార్చారతిన్
స్వామిద్రోహము వాపికొం డ్రచట మెచ్చ న్వచ్చుఁ దద్జ్ఞానమున్.

37


వ.

అందుఁ గపర్ది యనుప్రమథుఁడు ప్రతిష్ఠించినకపర్దీశ్వరలింగంబుప్రభావం బుపన్యసించెద నాకర్ణింపుము.

38


కపర్దీశ్వరప్రభావకథనము

సీ.

కాశి కుత్తరదిక్ప్రదేశంబునం దుండు
        విమలోదకం బనుకమలసరసి

  1. ‘నరవరేణ్యుని మోహమాహాత్మ్యమునను’ అని వ్రాఁతప్రతి.