పుట:కాశీఖండము.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

337


[1]ఆదికేశవదేవుఁ డభ్యాసమున నుంచి
        రవి శంభుఁ గనిపించె రత్నమూర్తి
విమలాహ్వయుఁడు రాజు కమలబంధు భజించి
        ప్రబలకుష్ఠవ్యాధిబాధఁ బాసెఁ
దొల్లి గంగ భగీరథుఁడు తెచ్చునప్పు డ
        న్నదిఁ జూచి వినుతించినాఁడు తరణి


తే.

యముఁడు యమతీర్థమునఁ దండ్రి నర్కుఁ గొలిచి
తపము గావించి వడసెఁ దత్కరుణ గాన
[2]నిన్నిచిహ్నలఁ గాశిలో నినులపేళ్లు
వాట మైయుండు ధన వాని వానివలన.

27


శివుండు బ్రహ్మం గాశి కనుపుట

వ.

వెండియుం గాశీవియోగవేదనాక్రాంతస్వాంతుం డై యంధకారాతి తద్వృత్తాంతశ్రవణకౌతూహలంబున విధాత మహాపరేతనిలయంబునకుం బంచువాఁడై యవ్విరించి రావించి యిట్లనియె.

28


ఉ.

పోయెను యోగినీబలము పోయిన పోకనె పోయెఁ బిమ్మటం
దోయజబాంధవుం డతఁడునుం దడసెంగడుఁ [3]జెర్వుఁ జూడఁగా
బోయినతూఁడుతీఁగెక్రియఁ బోయినయట్లనె కాశిఁ జిక్కిరీ

  1. ఇది ప్రాఁతవ్రాఁతప్రతుల పాఠము. సంస్కృతమూలమునకుఁ గొంతవఱకు సరిపడుచున్నది. పూర్వముద్రితగ్రంథమున ‘ఆదికేశవదేవుఁ డభ్యాసమున నుబ్బి, యనిశంబు గొల్చిన యర్కమూర్తి’ యనియున్నది. ఈ పాఠము చింత్యము.
  2. ‘నిన్నిచిన్నెలఁ గాశిలో నినులపేళ్లు’ అని వ్రాఁతప్రతుల పాఠము.
  3. ‘నీరుచూడఁగాఁ, బోయినయట్టి తామరలపోలికి నందఱు కాశిఁ’ అని పాఠాంతరము.