పుట:కాశీఖండము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22 శ్రీకాశీఖండము

కాశీఖండ మఖండవైభవమునన్ స్కాందాబ్ధిమధ్యంబునన్. 81

వ. ఈకాశీఖండంబు వేదవ్యాససూతసంవాదాత్మకం బనియునుం గొందఱు చెప్పుదురు. దీనికిం గథాక్రమణిక వింధ్యనారదసంవాదంబు, బ్రహ్మలోకప్రభావంబు, గోదానమాహాత్మ్యంబు, వారాణసియం దగస్త్యాశ్రమవర్ణనంబు, మునిదేవతాసమాగమంబు, పతివ్రతాచరితంబు, కుంభసంభువప్రార్థనంబు, తీర్థప్రశంస, శివశర్మోపాఖ్యానంబు, సప్తపురీప్రశంస, సంయమనీప్రశంస, మహేంద్రలోకదర్శనంబు, వహ్నిసముత్పత్తి, క్రవ్యాద్వరుణసంభవంబు, గంధవత్యలకావర్ణనంబు, చంద్రలోకప్రాప్తి, యుడులోకవృత్తాంతంబు, శుక్రసముద్భవంబు, శనైశ్చర్యలోకవర్ణనంబు, సప్తర్షిలోకధ్రువలోకవర్ణనంబులు, కుమారాగస్త్యసంవాదంబు, మణికర్ణికాసముద్భవంబ, గంగామాహాత్మ్యంబు, భైరవావిర్భావంబు, దండపాణిజన్మంబు, కళావత్యుపాఖ్యానంబు, సదాచారంబు, బ్రహ్మచారిప్రకరణంబు, స్త్రీలక్షణంబు, కృత్యకృత్యప్రకరణంబు, గృహస్థధర్మంబు, యోగనిరూపణంబు, కాలజ్ఞానంబు, దివోదాసవర్ణంనంబు, యోగినీవర్ణనంబు, లోలార్కోత్తరార్కసంజ్ఞాదిత్యద్రుపదాదిత్యారుణాదిత్యవర్ణనంబు, దశాశ్వమేధతీర్థమాహాత్మ్యంబు, పిశాచవిమోచనంబు, డుంఠీప్రాదుర్భావంబు, విష్ణుమాయాప్రపంచంబు, దివోదాససముచ్చాటనంబు, పంచనదోత్పత్తి, మందరాచలంబుననుండి యిందుమౌళి వారాణసీపురంబున కేతెం