పుట:కాశీఖండము.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

323


వ.

ఇవ్విధంబుల నానారూపవిధంబులు గైకొని వారణాసికిం జని రనంతరంబ.

317


ఈశ్వరుండు సూర్యునిం గాశి కంపుట

తే.

మనసిజారాతి సిద్ధయోగినులఁ బంపి
యూరడిలి యుండఁ జాలక యుష్ణకరుని
ననిచెఁ గాశికానగరివృత్తాంత మరయఁ
గౌతుకము కాలయాపనాక్షమము గాదు.

318


సీ.

పురివైరి రవిఁ గాశిపురి కన్పునప్పు డే
        కాంతంబు సేసి య ట్లనుచుఁ బలి రే
వాసరాధిప! దివోదాసు ధరాత్ముని
        నేయుపాయంబుననేని ధర్మ
విముఖుఁ గావింపుము విడియంగ నాడకు
        ధర్మమార్గైకతత్పరత నతని
మన మాదరింపకుండిన ధర్మ మెబ్భంగి
        నభివృద్ధి బొందుఁ? గా నగునయంబు


తే.

[1]దప్పకుండంగ నేదేని తప్పుటొఱపు
మత్సరాహంకృతులను గామమునఁ గ్రోధ
మోహములఁ బ్రత్యవాయంబు మోపఁదలఁచి
తప్పు లేకయ శిక్షింపఁ దగవు గాదు.

319
  1. ఇచట ‘తప్పకుండదు నెడనొక్క తప్పువెఱపు’ అని యచ్చుప్రతిలోను, ‘తప్పకుండ నెందే నొక తప్పువెఱపు’ అని యొకవ్రాఁతప్రతిలోను, ‘తప్పకుండంగ నేదేని తప్పుటొఱపు’ అని కొన్నివ్రాఁతప్రతులలోను పాఠభేదములు గనఁబడుచున్నవి. ప్రథమపాఠము కేవల మపభ్రంశముగ నున్నది. తక్కిన పాఠములఁ గ్లిష్టార్థకల్పన చేయఁదగియున్నది. దోషజ్ఞులు ప్రమాణము.